Pushpa 2 : ఓటీటీ పుణ్యమా అని ఈమధ్య మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుండడం విశేషం. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మంది ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు ఈమధ్య మన దక్షిణాదిన బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలను చూస్తూ సోషల్ మీడియా ద్వారా తమ అనుభూతిని పంచుకుంటూ ఉంటారు. #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు అలాగే వచ్చింది. చివరికి ఆస్కార్ అవార్డ్స్ వరకు ఆ చిత్రాన్ని నామినేషన్స్ లోకి వెళ్లేలా చేసింది, ఆస్కార్ అవార్డుని కూడా ముద్దాడే పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి హాలీవుడ్ ఆడియన్స్ మన సినిమాలను మిస్ కాకుండా నెట్ ఫ్లిక్స్ లో చూస్తూనే ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని కూడా హాలీవుడ్ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.
ముఖ్యంగా ‘పుష్ప 2 ‘ క్లైమాక్స్ లో వచ్చే ‘రప్పా రప్పా’ ఫైట్ సీన్ ని హాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ హ్యాండిల్ నేడు ఉదయం ట్విట్టర్ లో అప్లోడ్ చేసింది. ‘పిక్చర్స్ ఫోల్డర్’ అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్ కి దాదాపుగా 44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ ని మైంటైన్ చేసే వ్యక్తి ఈ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతూ ట్వీట్ వేయగా, దానికి 68 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సన్నివేశాన్ని చూసిన హాలీవుడ్ ఆడియన్స్, ఎవరు అసలు ఇతను, మనిషేనా?, ఆలా చేశాడేంటి? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. ఈ హీరో మనిషిలా అనిపించడం లేదు, AI ద్వారా క్రియేట్ చేసిన రోబో అనుకుంటా అంటూ రకరకాల కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ నటనకి అంతటి షాక్ కి గురయ్యారు వాళ్లంతా.
అభిమానులు ఈ వీడియో ని షేర్ చేస్తూ, ఎంతో గర్వపడుతూ ట్వీట్స్ వేస్తున్నారు. హాలీవుడ్ ఆడియన్స్ ఊపు చూస్తుంటే, అల్లు అర్జున్ కి ఆస్కార్ అవార్డు వచ్చే వరకు ఊరుకునేలా లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ కి కచ్చితంగా రెండవసారి నేషనల్ అవార్డు వస్తుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కానీ అల్లు అర్జున్ గురి నేషనల్ దాటి ఇంటర్నేషనల్ కి వెళ్లిందని నేడే అభిమానులకు కూడా అర్థమైంది. పుష్ప బాక్స్ ఆఫీస్ జాతర పర్వం ముగిసింది, ఇక అవార్డులు, రివార్డు పర్వం మొదలైంది. అల్లు అర్జున్ పేరు ఈసారి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగనుంది అంటూ ఆయన అభిమానులు చాలా బలమైన నమ్మకంతో చెప్తున్నారు. చూడాలి మరి అంత రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది. ఇకపోతే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీ గా ఉన్నాడు.
Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp
— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025