Allu Arjun phone DP: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి యావత్ ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. AA26x A6 అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 30% షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2026 వ సంవత్సరం ఎండింగ్లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఫోన్లోని డీపీ ఫోటో వైరల్ అవుతోంది. తన ఫోన్ డిపీ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు… ఇక అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా డీపీ పెట్టుకున్నాడు. 2026 మార్చ్ 27 నో షుగర్, నో స్నాక్స్, నో సోడా అని అందులో ఉంది. అది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఆ డేట్ వరకు ఆయన తన ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే డైట్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. జిమ్ లో ట్రైనర్ తీసిన ఫోటో లో అల్లు అర్జున్ డిపి ఫోటో కూడా పడింది. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆయన అట్లీ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. దాని కోసం బాడీ మైంటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఏది చేసినా కూడా అదొక సంచలనంగా మారుతొంది. నిజానికి ఆయన డీపీ అలా పెట్టుకుంటే తను డైట్ చేస్తున్న విషయం మర్చిపోకుండా ఉండటానికి ఇలా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది…
తనకు ఇండియా మొత్తం పాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయన తదుపరి సినిమా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్ గా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు. తన ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అట్లీతో వస్తున్న సినిమా 2026 మార్చి 27 వరకు అల్లు అర్జున్ పోర్షన్ మొత్తాన్ని షూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత నుంచి ఒక నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసుకొని 2026 డిసెంబర్లో ఆ సినిమాని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఒకసారి అల్లు అర్జున్ ఏదైనా సినిమాకి కమిట్ అయ్యారంటే ఆ సినిమాకు సంబంధించిన వర్క్ ను పూర్తి డెడికేషన్ తో చేస్తూ ఉంటాడు. అందుకే అతని సినిమాల్లో అతను పడిన కష్టమైతే మనకు కనిపిస్తుంటుంది. ఇక ఇప్పుడు కూడా ఆయన అట్లీ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…