Allu Arjun In Ghajini 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మన అందరికి తెలిసిందే..గత ఏడాది పుష్ప సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..కేవలం తెలుగు లో మాత్రమే కాదు..హిందీ లో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది..కేవలం 3 కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో అక్కడ 120 కోట్ల రూపాయిల వరుకు వసూళ్లు రాబట్టింది..ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ అద్భుతమైన నటనే..అందుకే అల్లు అర్జున్ కి ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది..ఇప్పుడు అల్లు అర్జున్ చేతిలో వరుసగా పాన్ ఇండియన్ సినిమాలే ఉన్నాయి..బడా బడా డైరెక్టర్స్ కూడా అల్లు అర్జున్ డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు..కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ ద్రుష్టి మొత్తం పుష్ప 2 మీదనే ఉంది..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం,ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతుంది.

ఇది ఇలా ఉండగా పుష్ప సినిమాకి ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ ఖరారైన సంగతి మన అందరికి తెలిసిందే..పుష్ప సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఊసే కనపడలేదు..అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..మురదాస్ గారి కెరీర్ లో గజినీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది మన అందరికి తెలిసిందే..తమిళం తో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచి ఆ సినిమాలో హీరో గా నటించిన సూర్య కి స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టింది..అలాగే హిందీ లో ఈ సినిమాని అమిర్ ఖాన్ తో రీమేక్ చేస్తే అక్కడ కూడా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..బాలీవుడ్ లో తొలి వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తీసే ఆలోచనలో ఉన్నాడట మురగదాస్..ఈ సీక్వెల్ లో అల్లు అర్జున్ హీరో గా నటించబోతున్నట్టు తెలుస్తుంది..ఇటీవలే అల్లు అర్జున్ ని కలిసి స్టోరీ ని వినిపించగా ఆయనకీ అది బాగా నచ్చి వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చెయ్యబొయ్యే సినిమా ఇదే కావొచ్చు అని కూడా ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.
