Naga Chaitanya – Samantha: సమంతతో నాగ చైతన్య అధికారికంగా విడిపోయి ఏడాది గడుస్తుంది. 2021 అక్టోబర్ నెలలో సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. ఈ వార్త జనాలకు మీడియా వర్గాలకు పెద్దగా షాక్ ఇవ్వలేదు. కారణం ప్రకటనకు రెండు నెలల ముందు నుండే ఈ ప్రచారం జరిగింది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు మార్చడం, చైతూ, సమంత విడివిడిగా ఉండటం, భర్త లేకుండా సమంత టూర్స్… అన్నీ వెరసి విడాకులు ఖాయమేనని ఓ అభిప్రాయానికి వచ్చారు.

అయితే విడాకులు కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుత అందరూ కనబరిచారు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా సమంతను నిందిస్తూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని, ఎఫైర్స్ పెట్టుకున్నారని పలు నిరాధార కథనాలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు సమంతను ఇబ్బంది పెట్టాయి. తప్పుడు ప్రచారం ఆపాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయినా ఆగకపోవడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలకు సిద్ధమయ్యారు.
నాగ చైతన్య పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆ ఫ్యామిలీ నుండి నాగార్జున స్పందించారు. సమంత మంచి అమ్మాయి విడాకులు బాధాకర విషయం అన్నారు. మరోవైపు సమంత నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్ట్స్ పెడుతూ ఉండేది. తనకు అన్యాయం జరిగింది, చైతూ మంచోడు కాదన్న అర్థంలో ఆమె కొటేషన్స్, కామెంట్స్ ఉండేవి. విడాకులైన కొన్ని నెలల వరకు సమంత ఇంస్టాగ్రామ్ లో నిగూఢ అర్థంతో కూడిన పోస్ట్స్ పెడుతూ ఉండేది.
View this post on Instagram
కొన్నాళ్ళు పాటు సైలెంట్ గా ఉన్న సమంత మరలా నిద్రలేచింది. ఆమె నాగ చైతన్యను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. సమంత లేటెస్ట్ పోస్ట్ నేరుగా చైతూను ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. సమంత ఓ ఇంగ్లీష్ కోట్ రాసి ఉన్న టీ షర్ట్ ధరించింది. ఆ కోట్ ని హైలెట్ చేస్తూ ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ”నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు” అని ఆ ఇంగ్లీష్ కోట్ అర్థం. ఒంటరిగా బ్రతకడం నీవల్లకాదని సమంత ఎవరినో ప్రశ్నించింది. అది ఎవరో కాదు, నాగ చైతన్యే అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.