Allu Arjun Vs Trivikram: గత సంవత్సరం అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాడు. బాహుబలి 2 (Bahubali 2) రికార్డు బ్రేక్ చేసి 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atle) తో సినిమా చేస్తున్నాడు. అయితే పుష్ప 2 సినిమా జరుగుతున్నప్పుడే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయబోతున్నాను అంటూ అనౌన్స్ అయితే చేశారు. ఇక ప్రొడ్యూసర్ నాగవంశీ సైతం ఈ మూవీ 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది…మైథాలాజికల్ డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దానికోసమే త్రివిక్రమ్ సైతం సంవత్సరన్నర పాటు ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. కానీ కట్ చేస్తే అల్లు అర్జున్ అట్లీతో సినిమా కమిట్ అయ్యాడు… దాంతో త్రివిక్రమ్ సైతం అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఇద్దరి కాంబినేషన్ లో చేయాలనుకున్న మైథాలాజికల్ సినిమా కథని ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ తో చేయాల్సిన ప్రాజెక్టును ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్నాడు అనేది వాస్తవం… మరి వీళ్ళిద్దరి మధ్య విబేధాలు రావడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనే కోణంలో ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
నిజానికి అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదగడంలో త్రివిక్రమ్ కీలక పాత్ర వహించారు. అప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేని అల్లు అర్జున్ కెరియర్ లో అలా వైకుంఠపురంలో (Ala Vaikuntapuram lo) లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందించి పెట్టాడు.
Also Read: Allu Arjun: శక్తి మాన్ గా అల్లు అర్జున్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
అలాంటి డైరెక్టర్ ను సంవత్సరం పాటు బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక స్టార్ హీరోలందరు డైరెక్టర్లతో సినిమా చేస్తాము అని కమిట్ అయి వాళ్ళని వేరే సినిమా చేసుకొనివ్వకుండా నెక్స్ట్ మన సినిమానే అంటూ వాళ్ళ కాంపౌండ్ లో కట్టేసుకుంటారు. దీనివల్ల వాళ్లు ఆ హీరోల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
చివరి నిమిషంలో వాళ్లకి అంతకంటే టాప్ డైరెక్టర్ వచ్చి వాళ్ళను సర్ప్రైజ్ చేసే కథ చెబితే ఇంతకు ముందు ఉన్న దర్శకులను పక్కన కూర్చోబెట్టి మధ్యలో వచ్చిన దర్శకుడితో సినిమాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల హీరోలు కోట్లు సంపాదిస్తుంటే దర్శకులు మాత్రం ఖాళీగా సినిమాలు లేకుండా కూర్చుంటారు. దీనివల్ల డైరెక్టర్స్ విపరీతంగా నష్టపోతున్నారనే చెప్పాలి… గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఒక సినిక చేసిన కూడా దాదాపు ఆయన 40 కోట్ల వరకు సంపాదించుకునే వారు…దీనివల్ల త్రివిక్రమ్ అటు టైమ్ ఇటు మనీ రెండు నష్టపోయారు…ఇక వీళ్ళిద్దరిలో అల్లు అర్జున్ గారిదే ఎక్కువ తప్పు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు…