Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నేడే మొదలైంది. నిన్న చప్పుడు లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం, నేడు షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ, అల్లు అర్జున్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మైథలాజికల్ మూవీ మాత్రం రద్దు అయ్యింది. ఆ సినిమా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) చేతుల్లోకి వెళ్ళింది. అదే విధంగా గతంలో అల్లు అర్జున్, సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కూడా రద్దు అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) చేయబోతున్నట్టు సమాచారం. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ మొత్తం రద్దు అవ్వడం పై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన నిరాశని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఈ ఏడాది సినీ పరిశ్రమ మామూలుగా షేక్ కాలేదు.. ప్రారంభం నుంచి ముగింపు వరకు వివాదాలే వివాదాలు..
దానికి తోడు అల్లు అర్జున్ రీసెంట్ గా పెద్ద పాపులారిటీ లేని డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు నిన్న రాత్రి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. బంగారం లాంటి ప్రాజెక్ట్స్ ని వదిలేసి అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి రూట్ లో వెళ్తున్నాడని అభిమానులు మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించారు. కానీ అల్లు అర్జున్ డైరెక్టర్ ని నమ్మడని, కేవలం స్క్రిప్ట్ ని మాత్రమే నమ్ముతాడని కాసేపటి క్రితమే అర్థం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మలయాళం లో బసిల్ జోసెఫ్(Basil Joseph) అనే టాప్ డైరెక్టర్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఓటీటీ లో మన తెలుగు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న చిత్రం ‘మిన్నల్ మురళి’. ఇది ఒక సూపర్ హీరో సినిమా. అలాంటి తరహా కాన్సెప్ట్ తోనే అల్లు అర్జున్ తో బసిల్ జోసెఫ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
Read Also: మల్లెమాలలో భారీ కుట్ర..!? జబర్దస్త్ షో ను సంకనాకించింది ఆ కమెడియన్ నేనట..!?
ఈ సినిమాకు ‘శక్తి మాన్’ అనే టైటిల్ ని కూడా పెట్టారట. ఇది కేవలం ఒక్క సినిమా తో ఆగిపోదు. పెద్ద సిరీస్ ని ప్లాన్ చేసాడట బసిల్ జోసెఫ్. అట్లీ తో సినిమా పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుందట. ముందుగా ఈ చిత్రాన్ని బసిల్ జోసెఫ్ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో అతను ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసాడు. అల్లు అర్జున్ ఒక ప్రాజెక్ట్ ని ఎంచుకున్నాడంటే కచ్చితంగా అందులో దమ్ము ఉంటుందని బలంగా ఫిక్స్ అవుతుంటారు అభిమానులు. ఈ సినిమాలో కూడా రణవీర్ సింగ్ చూడని కోణాన్ని అల్లు అర్జున్ చూసి ఉంటాడని , అందుకే ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడని అంటున్నారు. మరో నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటిస్తారట. ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న చిత్రం సూపర్ హీరో జానర్ లోనే తెరకెక్కుతుంది, ఆ తర్వాత చేయబోయే చిత్రం కూడా అదే జానర్ లో తెరకెక్కుతుంది. చూస్తుంటే అల్లు అర్జున్ చిన్న పిల్లలలో ఎప్పటికి చెరిగిపోని ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది.