Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం లాయర్ నిరంజన్ రెడ్డి చొరవతో అల్లు అర్జున్ కి నాలుగు వారాల పాటు ఇంటెర్మ్ బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ చంచల్ గూడా జైలు నుండి బయటకి వచ్చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు. కానీ ఎంతసేపు ఎదురు చూసినా అల్లు అర్జున్ రాలేదు. అర్థ రాత్రి నుండి ఆయన అభిమానులు వందల సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని, అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూసారు, కానీ ఆయన రాలేదు. తీరా చూస్తే రాత్రి మొత్తం అల్లు అర్జున్ చంచల్ గూడా జైలులోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు.
అందుకు కారణం బెయిల్ మీద బయటకి విడుదల అయ్యేందుకు జరగాల్సిన ప్రక్రియలు పూర్తి కాకపోవడం వల్లేనే అట. హై కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సకాలంలో బెయిల్ కాపీలు తమకి అందలేదని, వెబ్ సైట్ లో కూడా బెయిల్ కాపీలను అప్లోడ్ చేయలేదని, అందుకే అల్లు అర్జున్ కి చంచల్ గూడా జైలు లోని మంజీరా బారక్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశామని, తెల్లవారుజామున ఆయన్ని విడుదల చేస్తామని పోలీసులు మీడియాకి తెలిపారు. అయితే అల్లు అర్జున్ ని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అతని తండ్రి అల్లు అరవింద్ చంచల్ గూడ జైలు కి విచ్చేశాడు. అతని విడుదల కోసం చాలా సేపటి వరకు ఎదురు చూసిన అల్లు అరవింద్, ఈరోజు రాత్రి మొత్తం జైలులోనే గడపాలని పోలీసులు చెప్పడంతో, ఆయన తన కారుని అక్కడే వదిలేసి, తీవ్రమైన అసహనంతో క్యాబ్ ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడట.
కావాలనే పోలీసులు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అవ్వబోతున్నారు అనే విషయాన్నీ తెలుసుకున్న వెంటనే ఆయన అభిమానులు భారీ స్థాయిలో చంచల్ గూడా జైలుకి తరళి వచ్చారు. ఆ కారణం చేత గొడవలు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ ఇంటికి తిరిగి వెళ్లే వరకు జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క హై కోర్టు అల్లు అర్జున్ విధించిన 50 వేల రూపాయిల పూచీకత్తు ని లాయర్ నిరంజన్ రెడ్డి సమర్పించాడు. ఆ తర్వాత ఆయన జైలుకి సరైన సమయంలో బైలు పేపర్స్ తీసుకొని రాకపోవడం వల్లే అల్లు అర్జున్ రాత్రంతా జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Looks like Allu Aravind garu took a uber/ola back. Never seen this happen – someone with 100s of crores of wealth had to book a cab in his own town …
He seem to be really frustrated pic.twitter.com/kQhn5fUz0x
— Vineeth K (@DealsDhamaka) December 13, 2024