https://oktelugu.com/

ముందుగా రొమాన్స్ మొదలెట్టిన పుష్ప !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ లో కాస్త రొమాన్స్ ఘాటుగా ఉంటుందట. ఎందుకంటే, సినిమాలో బన్నీ ఓ ఆటవిక మనిషి అని, సో.. అతని రొమాన్స్ కూడా అలాగే ఉంటుందని.. అందుకే […]

Written By:
  • admin
  • , Updated On : November 26, 2020 / 07:17 PM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ లో కాస్త రొమాన్స్ ఘాటుగా ఉంటుందట. ఎందుకంటే, సినిమాలో బన్నీ ఓ ఆటవిక మనిషి అని, సో.. అతని రొమాన్స్ కూడా అలాగే ఉంటుందని.. అందుకే సుకుమార్ ఈ సాంగ్ లో ఫుల్ రొమాన్స్ ను చూపిస్తున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసింది చిత్రబృందం.

    Also Read: మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బిగ్ బాస్ !

    మరి ఈ సాంగ్ లో ఇంకెంత రొమాన్స్ ఉంటుందో చూడాలి. అసలుకే ఊర్వశి రౌటెలాకు హాట్ బ్యూటీ అని ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. మరి ఆమె పై ఏ రేంజ్ లో ఐటమ్ సాంగ్ ను తీస్తారో. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది కాబట్టి.. బన్నీ టీం మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట. అయితే ప్రస్తుతం తక్కువమంది స‌భ్యుల‌తోనే షూట్ ను స్టార్ట్ చేసారు.

    Also Read: బిగ్ బాస్ హౌస్‌ లో ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు !

    పైగా వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచబోతున్నారు. ముఖ్యంగా పుష్ప చిత్రబృందం వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం గాని.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రావడం గాని లేకుండా పలు జాగ్ర‌త్త‌లను తీసుకుంటున్నారట. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో… ఈ సినిమా మ్యూజిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేవి నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్