https://oktelugu.com/

కాపీ కొట్టడానికి తెలివి ఉండాలె.. బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీపై మంత్రి కేటీఆర్ మరో అస్త్రం సంధించారు. అయితే ఇది బీజేపీ పరువు తీసేలా ఉంది. లేట్ గా ఈరోజు విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. హిందీలో సెటైర్లు వేస్తూ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ మేనిఫెస్టో ఫేక్ అంటూ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 07:52 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీపై మంత్రి కేటీఆర్ మరో అస్త్రం సంధించారు. అయితే ఇది బీజేపీ పరువు తీసేలా ఉంది. లేట్ గా ఈరోజు విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. హిందీలో సెటైర్లు వేస్తూ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ మేనిఫెస్టో ఫేక్ అంటూ పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ‘నకల్ మార్ నే ఖో భీ అకల్ ఛాహియే’ అంటూ కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. బండన్న నీ తెలివికి దండ రా నాయనా.. ఫేక్ బీజేపీ’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందిస్తూ కేటీఆర్ ఈ ఘాటు ట్వీట్ చేశాడు.

    Also Read: ప్రధాని మోడీ సడెన్ గా హైదరాబాద్ టూర్ వెనుక కారణమేంటి?

    ఇలా వాడడాన్ని హైదరాబాద్ లో ఏమంటారో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలే అని ‘కల్ మార్ నే ఖోచీ అఖిల్ ఛాహియే’ అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఫొటోలు అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన ఫొటోలు వాడడం మీద ఇలా రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు తమ మేనిఫెస్టోలో బీజేపీ వాడిందని.. ఇది తాము కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నామని చురకలంటించారు.

    Also Read: ‘గ్రేటర్’ వార్: టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే!

    బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ సెటైర్లు చేశారు. దుమ్మెత్తిపోశారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ మేనిఫెస్టో రైటర్స్ కు తెలివి ఉందా అని ఎద్దేవా చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్