Pushpa Movie: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” పుష్ప”. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజు అనే మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం పై ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట ఈ ఏడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటుంది. దానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు చిత్ర బృందం. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలానే సునీల్, అనసూయ భరద్వాజ్ లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.