https://oktelugu.com/

Pushpa Movie: హిందీలో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ “పుష్ప”… ఎంతంటే ?

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మూడో వారంలోకి అడుగు పెట్టింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఈ చిత్రం నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లకు అక్కడి ట్రేడ్ పండిట్లు కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 04:18 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మూడో వారంలోకి అడుగు పెట్టింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఈ చిత్రం నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లకు అక్కడి ట్రేడ్ పండిట్లు కూడా విస్తుబోతున్నారు. కాగా బాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కావాల్సిన ‘జెర్సీ’ సినిమా వాయిదా పడటంతో ‘పుష్ప’ సినిమాకు మరింత కలిసొచ్చింది.

    ‘పుష్ప’ సినిమా సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. మూవీ విడుదలైన 16వ రోజు హిందీలో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా రిలీజైన ఇన్ని రోజుల తర్వాత ఈ వసూళ్లు రావడం కష్టం. ఈ ఏడాది హిందీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సూర్యవంశీ’ 16వ రోజు రూ.3.77 కోట్ల గ్రాసే కలెక్ట్ చేసింది. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమా ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

    ఇంకా ఆశ్చర్య పోవాల్సిన విశేషం ఏంటంటే… ఇప్పటిదాకా ‘పుష్ఫ’ ఒక్క రోజులో కలెక్ట్ చేసిన అత్యధిక మొత్తం కూడా ఇదే. మొత్తంగా శనివారం నాటికి ఈ చిత్రం హిందీలో రూ.57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘జెర్సీ’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సైతం వాయిదా పడటంతో ‘పుష్ప’ డ్రీమ్ రన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.75 కోట్ల గ్రాస్ మార్కును కూడా ఈజీగానే టచ్ చేసేలా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని.