https://oktelugu.com/

Ravi Teja: రెమ్యూనరేషన్ గురించి క్లారిటి ఇచ్చిన మాస్ మహరాజ్… ఏమన్నాడంటే ?

Ravi Teja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ క్రమం లోనే దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్న చిత్రం “ఖిలాడి”. మాస్ మహరాజ్ సరసన మీనాక్షి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 04:39 PM IST
    Follow us on

    Ravi Teja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ క్రమం లోనే దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్న చిత్రం “ఖిలాడి”. మాస్ మహరాజ్ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు హుటాహుటిగా జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ షూటింగ్ లలో బిజీ కానున్నాడు రవి తేజ. ఇదిలా ఉంటే రవితేజ రెమ్యునరేషన్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అతడు వరుస ఫ్లాపుల్లో ఉన్నా కానీ 10కోట్ల పారితోషికం ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడని.. ఎక్కడా తగ్గకపోవడంతో నిర్మాతలు సీరియస్ గా ఉన్నారని కూడా టాక్ వినిపించింది.

    దీనిపై బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో క్లారిటీ ఇచ్చాడు మాస్ రాజా. దీనిపై బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో క్లారిటీ ఇచ్చాడు రవితేజ. లాస్ట్ మూవ్ మెంట్ లో సినిమా ఫ్లాపైంది అనుకోండి … నేను డబ్బులు తిరిగిచ్చేసేవాడినిన్ అని అన్నారు. చెక్ చింపేసి ఇచ్చేసేవాడిని అని రవితేజ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ టాక్ షోలో రవితేజ – గోపిచంద్ మలినేనితో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుంది.