Pushpa 2 The Rule Trailer : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, వేలాది మంది అభిమానులు హాజరై, ఈ ఈవెంట్ ని విజయవంతం చేసారు. ఒక తెలుగు హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ రేంజ్ లో జనాలు తరలి రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. పుష్ప చిత్రం తో అల్లు అర్జున్ నార్త్ ఇండియా లో ఏ రేంజ్ లో పాతుకుపోయాడో, అక్కడి జనాలు ఈయనని ఎంతలా ఆరాధిస్తున్నారో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక ఉదాహరణ. దీనిని బట్టి మొదటి రోజు హిందీ వెర్షన్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి మీ ఊహలకే వదిలేస్తున్నాం.
ఈ ట్రైలర్ ప్రారంభం లో జగపతి బాబు మాట్లాడే డైలాగ్స్ పుష్ప క్యారక్టర్ కి ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఇచ్చినట్టుగా అనిపించింది. అల్లు అర్జున్ గెటప్స్, డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆయన అభిమానులకు ఉర్రూతలూ ఊగించేలా చేసింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా..ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ స్వాగ్ తో చెప్పే డైలాగ్ ఒక రేంజ్ లో పేలింది. చివర్లో ఫహద్ ఫాజిల్ తో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని కేశవ డైలాగ్ చెప్పగా, దానికి ఫహద్ ఫాజిల్ గన్ పేలుస్తూ ఫైర్ కదా అని కామెడీ గా అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అవుట్ & అవుట్ కమర్షియల్ సినిమాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీసినట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్స్, పోర్ట్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుంది. ట్రైలర్ మొత్తం బాగానే ఉంది కానీ, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు.
ఈ బ్లాక్ బస్టర్ ట్రైలర్ తర్వాత ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. 15 రోజుల క్రితమే 3 వేలకు పైగా షోస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 8 లక్షల 75 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. రోజుకి 40 నుండి 50 వేల డాలర్లు పెరుగుతూ వచేవట. ఇప్పుడు ఈ ట్రైలర్ తర్వాత రోజుకి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుందని. నార్త్ అమెరికా లోని ప్రీమియర్ షోస్ నుండి ఈ సినిమాకి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. టాక్ పాజిటివ్ గా వస్తే 4 మిలియన్ డాలర్లు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.