https://oktelugu.com/

Tollywood : ఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాపను గుర్తుపట్టగలరా?

ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంది. తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి వీడియో షేర్ చేసింది. “నా పెళ్లిరోజు కానుకగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బహుమతి ఇది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 17, 2024 / 06:05 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood :  టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ అన్ని భాషల్లో కూడా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీకి యూత్‏లో ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో ఎంతో క్యూట్‏గా కనిపిస్తున్న ఆ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్. మరి ఆమె ఎవరో కాదండోయ్ టాలీవుడ్ అడియన్స్ ఫేవరేట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో స్టార్ హీరోస్ సరసన నటించి బిజీగా మారింది ఈ సుందరి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల్లో భాగమయ్యింది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రకుల్.

    ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంది. తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి వీడియో షేర్ చేసింది. “నా పెళ్లిరోజు కానుకగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న ఈ వీడియో నాకు ఎంతో ప్రత్యేకం. చిన్నప్పటి మెమొరీస్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ నవ్వుతూ.. ఆడుతూ.. మీలోని చిన్నతనాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.

    రకుల్ షేర్ చేసిన ఆ వీడియోలో ఆమె చిన్నప్పుడు ఆడుకోవడం.. డ్యాన్స్ చేయడం.. ఐస్ క్రీమ్ తినడం.. బర్త్ డే కేక్ కటింగ్.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా రోజులుగా రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అలాగే అటు హిందీలోనూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ నెట్టింట మాత్రం సందడి చేస్తుంది.

    జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. రెండేళ్లు డేటింగ్ చేసిన ఈ ఇద్దరు ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకొని ఒకటైయ్యారు. ఇదెలా ఉంటే రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదనే చెప్పాలి. అయినా సరే అమ్మడు జోష్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. జిమ్‌కు వెళ్తోన్న వీడియోలు, లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఇలా ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఫ్యాన్స్ మాత్రం అమ్మడు సినిమాల్లో కనిపిస్తే బాగుండూ అంటూ తెగ వెయిట్ చేస్తున్నారు. మరి పెళ్లి తర్వాత నో సినిమాలు అంటుందో? లేదా సెలెక్టెడ్ క్యారెక్టర్స్ తో మళ్లీ కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.