https://oktelugu.com/

Pushpa 2 Collection:19వ రోజు మరో మైలురాయిని దాటిన ‘పుష్ప 2’..హాలీవుడ్ లో ‘ముఫాసా’ రికార్డు అవుట్..ఇంకెన్ని అద్భుతాలు చూడాలో!

19 వ రోజు కూడా ఈ చిత్రానికి స్టడీ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ కి 12 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 11:25 AM IST

    Pushpa 2 Collection(5)

    Follow us on

    Pushpa 2 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న రికార్డ్స్ ని మన కళ్లారా రోజూ చూస్తూనే ఉన్నాం. ఒక కమర్షియల్ తెలుగు సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత పవర్ ఉంటుందా అని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఆడియన్స్ ఎక్కువగా గ్రాండియర్ చిత్రాలనే ఆదరిస్తున్నారు. సినిమాలో ఎదో కొత్తదనం ఉంటే తప్ప థియేటర్స్ కి కదలడం లేదు. అలాంటిది పుష్ప 2 చిత్రం మామూలు కమర్షియల్ సినిమా అయినప్పటికీ, ఈ రేంజ్ వసూళ్లు రాబడుతుందంటే, కచ్చితంగా అది అల్లు అర్జున్ మ్యాజిక్ అని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ఈ చిత్రం 1500 కోట్ల రూపాయిల మైల్ స్టోన్ ని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అది కూడా కేవలం రెండు వారాల్లో. ఇప్పుడు 2000 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకి దూసుకుపోతుంది.

    19 వ రోజు కూడా ఈ చిత్రానికి స్టడీ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ కి 12 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం తరచూ స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది. అక్కడి ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రచారం ఈ చిత్రం 19 వ రోజు లక్ష 50 వేల డాలర్లను రాబట్టింది అంటున్నారు. తెలుగు వెర్షన్ వసూళ్లు క్లోజింగ్ కి రాగా, అక్కడ హిందీ వెర్షన్ వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆసచర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ చిత్రం నార్త్ అమెరికా లోని పలు ప్రాంతాల్లో రీసెంట్ గా విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ముఫాసా’ కంటే తక్కువ ఆక్యుపెన్సీలు నమోదు చేసుకున్నాయి.

    ఇది హాలీవుడ్ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేసిన విషయం. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాని డామినేట్ చేయడం ఏమిటి, ఇదెక్కడి విచిత్రం అంటూ వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి జనాలు పుష్ప సినిమాకి, పుష్ప క్యారక్టర్ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ పడిన మూడేళ్ళ కష్టానికి ఫలితం ఈ స్థాయిలో దక్కుతుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇది ఇలా ఉండగా ఈ క్రిస్మస్ ‘పుష్ప 2 ‘ కి అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే మన టాలీవుడ్ కి వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి కానీ, రెండు వేల కోట్ల రూపాయిల సినిమాలు లేవు. ఒకవేళ ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరితే, ఫారిన్ భాషల్లో అనువాదం కాకుండా, కేవలం ఇండియన్ భాషల్లో అనువాదమై రెండు వేల కోట్లు రాబట్టిన ఏకైక సినిమాగా ‘పుష్ప 2 ‘. 19 వ రోజు దాదాపుగా 18 కోట్ల రూపాయిలను ఈ సినిమా రాబట్టింది అంటే, కచ్చితంగా క్రిస్మస్ రోజున 40 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.