Indigo : విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కనీసం తమ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటుంటారు. అయితే, విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడం అంత సులువైన పని అయితే కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జీలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, ప్రస్తుత కాలంలో విమానయనరంగంలో భారీగా పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు, ప్రయాణికులను తమవైపునకు లాక్కునేందుకు విమానయన సంస్థలు చేయని ప్రయత్నాలు లేవు. ప్రయాణికులకు బెస్ట్ సర్వీస్ ఇస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ఛార్జీలకే తమ తమ గమ్యాలకు ప్రయాణించే అవకాశాలను కల్పిస్తున్నాయి.
భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. ఇది తన ప్రయాణీకుల కోసం గొప్ప ఆఫర్‌లను ప్రారంభించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిగో మరోసారి ‘గెట్‌వే సేల్’ని ప్రకటించింది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నారు. ఈ సేల్ 25 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతుంది. సామాన్య ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ క్రిస్మస్‌ను జరుపుకోవడానికి సోమవారం ప్రత్యేక గెట్-అవే సేల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టిక్కెట్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి దేశీయ మార్గాల్లో కనీసం రూ. 1199కి విమాన ప్రయాణాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో కనీసం రూ. 4,499కి విమాన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని కూడా చెబుతున్నారు.
ఇదే చివరి తేదీ
ఇందులో ప్రయాణీకులు జనవరి 23 నుండి ఏప్రిల్ 30, 2025 వరకు ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దేశీయ ప్రయాణ ఛార్జీలు రూ.1,199 నుంచి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ విమానాల ధర రూ. 4,499 నుంచి ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి ఇదిగొప్ప అవకాశం. ఇది కాకుండా, ఇండిగో కొన్ని 6E యాడ్-ఆన్‌లపై 15శాతం వరకు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఇందులో ప్రీపెయిడ్ యాక్సెస్ బ్యాగేజీ ఎంపికలు (15kg, 20kg, 30kg), ప్రామాణిక సీటు ఎంపిక, ఎమర్జెన్సీ XL సీట్లు వంటి వాటిపై కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌ల ధర దేశీయ విమానాలకు రూ.599, అంతర్జాతీయ విమానాలకు రూ.699 నుండి ప్రారంభమవుతుంది. బుకింగ్‌లపై మరిన్ని పొదుపుల కోసం ఇండిగో ఫెడరల్ బ్యాంక్‌తో కలిసి పనిచేసింది.
క్రెడిట్ కార్డ్‌పై అదనపు ప్రయోజనం
మీరు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసుకుంటే, మీకు దేశీయ విమానాలలో 15శాతం తగ్గింపు, అంతర్జాతీయ విమానాలలో 10శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. హాలిడే ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. టిక్కెట్ బుకింగ్ కోసం ఇండిగో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.