Allu Arjun: మెగా, అల్లు కుటుంబ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఏ స్థాయి ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే సంఘటన నుండే ఈ గొడవ మొదలైంది. ఇక ఈ ఎన్నికలలో ఆయన తన స్నేహితుడు, వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లి సపోర్టు చేయడంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఎప్పటికైనా గొడవ చల్లారిపోతుందిలే అని అనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రతీరోజు ఈ సంఘటన ఎదో ఒక కొత్త మలుపుని తిప్పుకుంటూ ముందుకు పోతూనే ఉంది. ఇటీవల అల్లు అర్జున్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి నంద్యాల ఘటన గురించి పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ కి తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఇది అల్లు అర్జున్ దృష్టికి చేరింది. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఘటనల గురించి ఆయన తన తండ్రి అల్లు అరవింద్ తో చర్చించబోతున్నాడు అట.
ఆయనతో చర్చలు జరిపిన తర్వాత అల్లు అరవింద్ తో కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులకు బలమైన కౌంటర్లు ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం. తాను కూడా అలా మాట్లాడలేక కాదు, గొడవలు పెంచుకోవడం ఇష్టం లేదు కాబట్టే అలా మాట్లాడడం లేదు, నా నోరు తెరిచేలా చేస్తున్నారు, ఇక తేల్చుకోవడమే అని తన సన్నిహితులతో అల్లు అర్జున్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన విషయంలో రెండు వైపుల నుండి తప్పులు ఉన్నాయి. ముందుగా అల్లు అర్జున్ నుండే ఈ గొడవలన్నీ మొదలయ్యాయి.వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ని ఎంతో వేధించింది, ఆయన సినిమాలను దారుణంగా తొక్కేసింది, ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టింది, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండే ఆడవాళ్లను కూడా అడ్డమైన బూతులు తిట్టించింది, చిరంజీవి ని సైతం అనరాని మాటలు అన్న పార్టీ అది. అలాంటి పార్టీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి బహిరంగంగా సపోర్టు ఇవ్వడం చాలా పెద్ద తప్పు, అందులో ఎలాంటి సందేహం లేదు.
శిల్పా రెడ్డి లాగానే తెలుగు దేశం పార్టీ లో ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ స్నేహితుడే. కానీ ఆయన గురించి కనీసం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు, కానీ శిల్పా రవి కి మాత్రం ఏకంగా నంద్యాల కి వెళ్లి సపోర్ట్ చేసాడు. ఇలా చేస్తే పెద్ద గొడవలు అవుతాయి అని తెలిసి కూడా అల్లు అర్జున్ అదే పని చేసాడంటే, కచ్చితంగా ఆయన గొడవలు కోరుకున్నాడు అని దాని అర్థం. మరోపక్క జనసేన నాయకుల నుండి కూడా తప్పు ఉంది, ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ ఒక సినిమా హీరోపై ఆ స్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం కూడా లేదు, త్వరలో జరగబోయే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.