https://oktelugu.com/

Deposit Limit : పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉంటే భారీగా పన్ను చెల్లించాలా..? నిబంధనలు ఏం చెప్తున్నాయి..

పొదుపు ఖాతా లో డిపాజిట్ పరిమితి ఎంత...అలాగే పొదుపు ఖాతా లో పరిమితి కి మించి డిపాజిట్ చేస్తే భారీ మొత్తం లో పన్ను చెల్లించాల్సి వస్తుందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకు ఖాతా దారులకు బ్యాంకులు నిర్దిష్ట డిపాజిట్ పరిమితిని అందిస్తాయి. పొదుపు ఖాతా దారులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

Written By:
  • Mahi
  • , Updated On : December 24, 2024 / 01:59 PM IST

    Deposit Limit

    Follow us on

    Deposit Limit :  సంపాదించి డబ్బు లో కొంచెం కొంచెం గా పొదుపు చేసి బ్యాంకు లో దాచుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కొంచెం కొంచెం గా పొదుపు చేసిన డబ్బులను తీసుకోని వెళ్లి బ్యాంకు లో డిపాజిట్ చేస్తారు. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్యాంకు లో ఎన్ని లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేల పరిమితికి మించి డిపాజిట్ చేస్తే ఏమవుతుంది అనేది చాలా మందికి అవగాహనా లేదు. పొదుపు ఖాతా లో డిపాజిట్ పరిమితి ఎంత…అలాగే పొదుపు ఖాతా లో పరిమితి కి మించి డిపాజిట్ చేస్తే భారీ మొత్తం లో పన్ను చెల్లించాల్సి వస్తుందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకు ఖాతా దారులకు బ్యాంకులు నిర్దిష్ట డిపాజిట్ పరిమితిని అందిస్తాయి. పొదుపు ఖాతా దారులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యాపార సంవత్సరం లో బ్యాంకు లోని ఖాతా దారులకు పొదుపు ఖాతా లో జమ చేసిన మొత్తానికి పరిమితి ఉంటుంది. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ వారు నోటీసు ను పంపిస్తారు. నోటీసు ప్రకారం వాళ్ళు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాల డిపాజిట్ పరిమితి రూ.10 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక ఆర్ధిక సంవత్సరం లో 1 ఏప్రిల్, 31 మార్చ్ మధ్య రూ. 10 లక్షలకు మించి డిపాజిట్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే భారీ మొత్తం లో పన్ను చెల్లించాల్సి వస్తుంది. అన్ని బ్యాంకు ఖాతా దారులకు ఇదే వర్తిస్తుంది.

    ఒక్క పొదుపు ఖాతా కు మాత్రమే కాదు అన్ని బ్యాంకు ల పొదుపు ఖాతా లకు ఈ నియమాలు వర్తిస్తాయి. బ్యాంకు లు స్వయం గా ఈ లావాదేవీ లా వివరాలను వెల్లడిస్తాయి. ఒకవేల రూ. 10 లక్షలకు మించి డిపాజిట్ చేసినట్లయితే అధిక విలువ కలిగిన లావాదేవీ గా బ్యాంకు లు పరిగణిస్తాయి. బ్యాంకు లు లేదా ఆర్ధిక సంస్థలు అటువంటి అధిక విలువ కలిగిన లావాదేవీ ల వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి అందిస్తాయి. ఒక రోజులో రూ.50 ,000 రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ కు కూడా పాన్ తప్పనిసరి అన్న విషయం అందరికి తెలిసిందే.

    పాన్ లేని వారు ఫారం 60 /61 ను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంవత్సరం లో మీ పెట్టుబడుల పై రూ. 10 ,000 కంటే ఎక్కువ వడ్డీ పొందినట్లయితే నిర్దేశించిన స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80 TTA కింద రూ. 10 ,000 కంటే తక్కువ వడ్డీ పొందే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ సెక్షన్ కింద సీనియర్ సిటిజెన్లు కూడా కూడా రూ. 50 ,000 వరకు వడ్డీ పై పన్ను మినహాయింపు పొందొచ్చు.