Allu Arjun: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు శంకర్.. ఇక ఈయన రోబో సినిమాతోనే ప్యాన్ ఇండియా సినిమా తీశాడు. అయితే అప్పట్లో రోబో సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి మంచి సక్సెస్ గా నిలిచినప్పటికీ ఇక ఆ తర్వాత ఆయన పాన్ ఇండియా సినిమాలను కంటిన్యూ చేయలేకపోయాడు. ఆయనకు పాన్ ఇండియా లో దర్శకుడిగా మంచి గుర్తింపు అయితే రాలేదు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ ను హీరోగా పెట్టి చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ను హీరో గా పెట్టి ‘జెంటిల్ మెన్’ సినిమాకి సీక్వెల్ ను తీయాలని చూస్తున్నాడు. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి శంకర్ కి డేట్స్ ఇస్తాడా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ తో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. మరి ఈ క్రమంలో శంకర్ తో సినిమా అంటే దాదాపు ఆ సినిమా పైన రెండు నుంచి మూడు సంవత్సరాల టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన శంకర్ తో సినిమా చేసి మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించగలడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే శంకర్ ప్లానింగ్ అయితే బానే ఉంది.
కానీ దానికి అల్లు అర్జున్ డేట్స్ ఇస్తాడా లేదా అని దాని మీదే ఇప్పుడు పలు రకాల అభిప్రాయలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం శంకర్ తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో తమిళ్ సినిమా హీరోలను ఆయన అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి తమిళ్ ప్రేక్షకులు శంకర్ పైన కొంతవరకు కోపంతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది…