https://oktelugu.com/

Narayanan Vaghal : ఇండియన్ బ్యాంకింగ్ ‘భీష్మ పితామహ’.. సాధించిన ఘనతలు ఎన్నో

యాక్సిస్ బ్యాంక్ మాజీ MD, CEO శిఖా శర్మ, కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నారాయణన్, TAFE చైర్‌పర్సన్ మల్లికా శ్రీనివాసన్, L&T CMD SN సుబ్రహ్మణ్యన్ కూడా వాఘల్ కు నివాళులర్పించారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2024 / 11:16 AM IST

    Renowned banker and Padma Bhushan awardee Narayanan Vaghal passed away

    Follow us on

    Narayanan Vaghal : ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణన్ వాఘల్ అంత్యక్రియలు ఆదివారం (మే 19) నగరంలో జరిగినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయని పీటీఐ నివేదించింది. వఘుల్ (88) అనారోగ్య కారణాలతో శనివారం (మే 18) మృతి చెందారు. ఆయనకు భార్య పద్మ, కుమారుడు మోహన్, కుమార్తె సుధ ఉన్నారు.

    ఒక మార్గదర్శక బ్యాంకర్
    * నారాయణన్ వాఘుల్ ICICI బ్యాంక్ లిమిటెడ్‌కు 24 సంవత్సరాల పాటు చైర్మన్ అండ్ CEO గా పనిచేశారు. దేశంలో రెండో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా మార్చేందుకు ఆయన కృషి చేశారు. దీంతో పాటు దేశంలో యూనివర్సల్ బ్యాంకింగ్ మోడల్‌కు మార్గదర్శకత్వం వహించారు.
    * భారత మొదటి వెంచర్ క్యాపిటల్ కంపెనీని స్థాపించింది నారాయణన్ వఘలే. అది పరిశ్రమలో అగ్రగామిగా ఎదిగింది.
    * ICICI సెక్యూరిటీస్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ, భారతదేశపు మొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన CRISIL స్థాపనలో వాఘుల్ కీలక పాత్ర పోషించారు. దాదాపు ఒక దశాబ్దం పాటు దీనికి వ్యవస్థాపక చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
    * బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ బై బిజినెస్ ఇండియా (1992), ఎకనామిక్ టైమ్స్ (2006), ఎర్నెస్ట్ & యంగ్ (2009), బాంబే మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (2013) నుంచి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సహా వాఘుల్ అనేక ప్రశంసలు అందుకున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ద్వారా కార్పొరేట్ గవర్నెన్స్‌కు ఆయన చేసిన కృషికి ఆయనను సత్కరించారు.
    * 2009లో భారతీయ బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో గణనీయమైన కృషి చేసినందుకు ప్రభుత్వం నారాయణన్ వఘుల్‌కు పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.

    ప్రముఖుల సంతాపం
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, మహీంద్రా అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా భారత బ్యాంకింగ్ ‘భీష్మ పితామహ’కు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం సంతాపం తెలిపారు. అనేక మంది దిగ్గజ మహిళా బ్యాంకర్లకు మార్గదర్శకత్వం వహించిన ఘనత ఆయనదని గుర్తు చేసుకున్నారు.

    ‘ఐసీఐసీఐని ఆర్థిక శక్తిగా మార్చిన లెజెండరీ బ్యాంకర్. అతను ప్రతిభను గుర్తించాడు, మార్గదర్శకత్వం వహించాడు.. ప్రోత్సహించాడు, వారికి ఉన్నత బాధ్యతలు అప్పగించాడు. వారిలో చాలా మంది ముఖ్యంగా మహిళలు, లెజెండరీ బ్యాంకర్లుగా మారారు’ అని చిదంబరం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘అతని జీవితం బ్యాంకింగ్ పరిశ్రమకు మార్గనిర్దేశం చేస్తుంది, అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

    పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, ఏషియన్ పెయింట్స్ చైర్మన్ ఆర్ శేషసాయి, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి సహా పరిశ్రమ ప్రముఖులు వఘుల్ నివాసంలో నివాళులర్పించారు.

    యాక్సిస్ బ్యాంక్ మాజీ MD, CEO శిఖా శర్మ, కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నారాయణన్, TAFE చైర్‌పర్సన్ మల్లికా శ్రీనివాసన్, L&T CMD SN సుబ్రహ్మణ్యన్ కూడా వాఘల్ కు నివాళులర్పించారు.