Allu Arjun Lokesh Kanagaraj Movie Villain Update: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎన్నో రోజులు దానికోసం నిరీక్షించాల్సిన అవసరమైతే ఉంది. ఏ ఒక్కరు వచ్చి రాగానే ఇక్కడ స్టార్ హీరోలుగా మారిపోలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్లకు వచ్చిన అవకాశాన్ని వాడుకొని టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలామంది నటులు వారిని స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి మరింత ముందుకు దూసుకెళ్తున్నారు… పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఆయన చేసిన పుష్ప, పుష్ప2 సినిమాలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తున్నాడు. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజు తో చేయబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. లోకేష్ కనకరాజు ఇంతకుముందు చేసిన విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత చేసిన లియో, కూలీ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు…ప్రస్తుతం అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజు కాంబో మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోవాలని దాని మీద చాలా రోజుల నుంచి చర్చలైతే నడుస్తున్నాయి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
నిజానికి ఈ సినిమాలో విలన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. విలన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందట. దానికోసం తెలుగు సినిమాలో స్టార్ హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ ని సంప్రదించారట… కానీ గోపీచంద్ మాత్రమే ఆ క్యారెక్టర్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. అల్లు అర్జున్ సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి గోపీచంద్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఆయన ఒప్పుకుంటే ఆయన కోసం ఎంత రెమ్యూనరేషన్ అయిన సరే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట… గోపీచంద్ సైతం కొంతవరకు ఆ క్యారెక్టర్ ని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
రాబోయే సినిమాలతో ప్లాప్ లను మూటగట్టుకొని ఈ క్యారెక్టర్ ని ఒప్పుకుంటానని, లేకపోతే మాత్రం తను ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక గోపీచంద్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఆయన్ని హీరోగా ఉంచాలా లేదంటే విలన్ గా మార్చాలా అనే ఒక కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇవ్వబోతున్నాయి…
