Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళ్లిన అల్లు అర్జున్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాతో ఏకంగా భారీ హిట్లను కూడా సాధించడానికి మరొక అడుగు దూరంలో ఉన్నాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. తన భార్య అయిన స్నేహ రెడ్డి (Sneha Reddy)తో పాటు తన కొడుకు అయాన్ (Ayan) తన కూతురు అర్హ (Arha) కూడా ఉండడం విశేషం… ఇక ఈ పిక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ ను చూసిన ప్రతి ఒక్కరు లుక్కు బాగుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు.
ఇక లైట్ బియర్డ్, స్మాల్ హెయిర్ తో కనిపించిన అల్లు అర్జున్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ ఉండటం విశేషం… బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పోటీ పదుతుంది అంటే మొదట బాహుబలి సినిమాతో రాజమౌళి(Rajamouli), ప్రభాస్ (Prabhas) ఏ రకంగా అయితే ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లారో మనకు తెలిసిందే…ఇక ఆ పరంపరను కొనసాగిస్తూ అల్లు అర్జున్ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకటైతే ఇక మీదట తను చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎందుకంటే ‘పుష్ప 2’ భారీ సక్సెస్ అయిన తర్వాత ఆయన చేయబోయే సినిమా అంతకుమించి ఉండాలి తప్ప దాని కంటే తగ్గకూడదు అనే ఉద్దేశ్యం తో అల్లు అర్జున్ ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…