Saif Ali Khan: బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు. ఇక కరీనా కపూర్ ఖాన్ ఆదివారం బాంద్రా వెస్ట్‌లోని లీలావతి హాస్పిటల్‌లో వారి పిల్లలు, తైమూర్, జెహ్ అలీ ఖాన్‌లతో కలిసి సైఫ్ అలీ ఖాన్‌ను కలిశారు. ఇక తన భర్త బాగానే ఉన్నాడని.. ఇప్పుడు కోలుకుంటున్నాడని కరీనా కపూర్ ఖాన్ తన ఖాన్‌తో కలిసి సోషల్ మీడియాలో మొదటి ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
బాంద్రాలోని సైఫ్ అలీఖాన్‌కు చెందిన సద్గురు శరణ్ భవనంలో బుధవారం రాత్రి దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు బంగ్లాదేశ్ జాతీయుడైన ప్రధాన నిందితుడు మొహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయ్ దాస్‌ను అరెస్టు చేశారు. అతడిని ఐదు రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇక సైఫ్‌పై దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ బంగ్లాదేశ్‌లో రెజ్లింగ్ ప్లేయర్ అని పోలీసులు పేర్కొనారు. జాతీయ స్థాయిలో రెజ్లింగ్ కూడా ఆడాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అతను డబ్బు సంపాదించడానికి భారతదేశానికి వచ్చాడట. ఇక రీసెంట్ గా ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్‌పై అతని బాంద్రా ఇంట్లో దాడి చేసిన సంఘటన గురించి వివరించారు. ఈయన నటుడిని అనేకసార్లు కత్తితో పొడిచాడు.
ఈ కేసులో నిందితుడు, 30 ఏళ్ల బంగ్లాదేశ్ మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను ఆదివారం ఉదయం థానేలో అరెస్టు చేశారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. విచారణలో భాగంగా, పోలీసులు షెహజాద్‌ను ‘సద్గురు శరణ్’ భవనంలోని ఖాన్ ఇంటికి తీసుకెళ్లి, నేరం జరిగిన ప్రదేశంలో సంఘటనను తెలుసుకున్నారు.
దొంగతనం చేయాలనే ఉద్దేశంతో జనవరి 15వ తేదీ అర్థరాత్రి షెహజాద్ నటుడి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. భవనంలోని ఏడో-ఎనిమిదో అంతస్తులోని మెట్లు ఎక్కినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఖాన్, అతని నటి భార్య కరీనా కపూర్ ఖాన్ అదే భవనంలోని 12వ అంతస్తులో వారి పిల్లలు, గృహ సిబ్బందితో నివసిస్తున్నారు.
ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు మెల్లగా కోలుకుంటున్నాడు. నటుడిని సోమవారం డిశ్చార్జ్ చేయాల్సి ఉందని, అయితే అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని లీలావతి హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నితిన్ డాంగే రీసెంట్ గా చెప్పారు. ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సైఫ్‌పై దుండగుడు పలుమార్లు కత్తులతో దాడి చేశాడు. అయితే నిందితుడు షెహజాద్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నటుడి ఇంట్లోకి ప్రవేశించాడని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి మొదట ఇంట్లో పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. దీని తర్వాత, శబ్దం విన్న సైఫ్ అలీఖాన్ అక్కడికి చేరుకోగా, దాడి చేసిన వ్యక్తి కత్తితో నటుడిపై దాడి చేశాడు.