AC Error Code : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. దీంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో కొత్త కొత్త ఏసీలు వస్తున్నాయి. కొత్త టెక్నాలజీతో వస్తున్న ఏసీలు చాలా ‘స్మార్ట్’గా ఉంటున్నాయి. ఏసీలో ఏదైనా పెద్ద సమస్య వస్తే టెంపరేచర్ బదులు ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. వేర్వేరు సమస్యలకు వేర్వేరు ఎర్రర్ కోడ్‌లు కనిపిస్తాయి. మీరు కూడా ఏసీ వాడుతుంటే ఏసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకు తెలిసి ఉండాలి. ఈరోజు Samsung AC, LG ACలలో కనిపించే ఎర్రర్ కోడ్‌లు ఏమిటి, ఈ ఎర్రర్ కోడ్‌ల అర్థం ఏమిటో తెలుసుకుందాం.
Also Read : ఈ ఏసీ ఉంటే కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. రాత్రింబవళ్లు వాడినా నో ప్రాబ్లమ్!
Samsung AC ఎర్రర్ కోడ్‌లు
* E1 లేదా 21: ఈ కోడ్ ఏసీలోని రూమ్ టెంపరేచర్ సెన్సార్‌లో సమస్య ఉందని తెలియజేస్తుంది.
* E1 లేదా 22: ఏసీలో ఈ కోడ్ కనిపిస్తే, హీట్ ఎక్స్ఛేంజర్ టెంపరేచర్ సెన్సార్‌లో సమస్య ఉందని అర్థం.
* E1 లేదా 54: ఫ్యాన్ మోటర్ లేదా కెపాసిటర్‌లో సమస్య వచ్చినప్పుడు ఏసీలో ఈ కోడ్ కనిపిస్తుంది. ఇదే విధంగా మరికొన్ని కోడ్‌లు కూడా కనిపిస్తాయి.
LG AC ఎర్రర్ కోడ్‌లు
* E2 లేదా CH01: ఇండోర్ పైప్ సెన్సార్‌లో ఓపెన్ సర్క్యూట్ లేదా షార్ట్ సర్క్యూట్ ఏర్పడినప్పుడు ఈ ఆటో స్టాప్ ప్రొటెక్షన్ ఎర్రర్ కోడ్ కనిపిస్తుంది.
* E3 లేదా CH03: ఏసీ నుండి గ్యాస్ లీక్ అయిన తర్వాత ఎయిర్ కండీషనర్‌లో గ్యాస్ లేనప్పుడు ఈ ఎర్రర్ కోడ్ కనిపిస్తుంది.
* E4: ఇది నిజానికి ఎర్రర్ కోడ్ కాదు. ఎవాపరేటర్‌పై మంచు పేరుకుపోయినప్పుడు ఏసీ డీఫ్రాస్ట్ మోడ్‌లోకి వెళ్లిందని తెలియజేస్తుంది. డీఫ్రాస్ట్ అయిన తర్వాత ఏసీ మళ్లీ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.
Also Read : ఏసీలో టన్ను అంటే బరువు కాదు.. దాని అసలు అర్థం తెలుసుకోండి!

