
Allu Arjun: ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. దక్షిణాదిలో మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ హీరో ఇప్పుడు ఉత్తరాది మార్కెట్ లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
సోషల్ మీడియా, డిజిటల్ మార్కెట్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈయన సినిమాలు హిందీ, మలయాళంలోనూ యూట్యూబ్ లో తెగ ఆడేస్తుంటాయి. డిజిటల్ మీడియాలోనూ ఈ మధ్య అల్లు అర్జున్ సత్తా చాటుతున్నాడు.
ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత హీరోగా అల్లు అర్జున్ పేరొందాడు. ఇక బన్నీ తర్వాత సోషల్ మీడియాలో 12.9 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ పక్కన విజయ్ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం క్రిస్మస్ కు ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా అరంగేట్రం ఈ మూవీతోనే సాగుతోది.
ఇక ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ‘శ్రీరామ్ వేణు ’ దర్శకత్వంలో ‘ఐకాన్’లో నటించడానికి ఒప్పుకున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఐకాన్ తర్వాత బన్నీ ‘పుష్ప2’ మూవీని చేయనున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డు సృష్టించాడు.