కొత్త తరం కమెడీయన్లలో.. తనదైన స్లాంగ్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. తాజాగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న నటులపై రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. బూతులతో పెట్టిన వరుస పోస్టులు.. ఇంకా ప్రకంపనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరి, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే చర్చ చిత్ర పరిశ్రమలో నడుస్తోంది.
రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నెట్’. అవికాగోర్ హీరోయిన్. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన రామకృష్ణ.. మా సినిమా గు*లో దమ్ముంది అని కామెంట్ చేశాడు. ఆ బూతుతోనే అందరూ ఆశ్చర్యపోగా.. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను టార్గెట్ చేశాడు. ఇలా కామెంట్ చేయడంపై గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది.
తెలంగాణ మాడలికంలో డైలాగ్ చెబుతూ.. మంచి క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. జాతి రత్నాలు సినిమాతో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రామకృష్ణ.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ అయ్యింది. తన అప్ కమింగ్ చిత్రం ప్రమోషన్ కోసం ఇలా చేశాడని అనుకుంటున్నప్పటికీ.. నెపోటిజంను క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మా చిత్రానికి గు*లో దమ్ముంది అని చెప్పిన రామకృష్ణ.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలను చూసి మా సినిమా భయపడదు అంటూ కామెంట్ చేశాడు. అయితే.. ఒకవేళ తాగి కామెంట్ చేశాడా? మద్యం మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఇలా అనుమానించడానికి కారణం ఉంది. ఇటీవల తన లవర్ తో కలిసి వైన్ తాగుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసి చర్చకు తెరతీశాడు. ఇప్పుడు కూడా.. మద్యం తాగి ఇలా కామెంట్ చేశాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. అది కాదని తేలిపోయింది. ఉదయం చేసిన ఈ కామెంట్లకు రోజంతా రాహుల్ రామకృష్ణపై ట్విటర్ లో ట్రోలింగ్ సాగింది. దీంతో.. సాయంత్రం లైన్లోకి వచ్చిన రామకృష్ణ.. తనను ట్రోల్ చేసిన వారందరినీ ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. ‘‘ఓహో.. ట్విట్టర్ లో ఉన్నవారంతా పత్తిత్తులే అన్నమాట’’ అంటూ.. పోస్టు చేశాడు. దీంతో.. రాహుల్ తాగి పెట్టిందేమీ కాదని, పూర్తిగా కాన్షియస్ లోనే ఈ పోస్టు చేశాడని తేలిపోయింది. అంటే.. తన సినిమా ప్రమోషన్లో భాగంగానే ఈ కామెంట్ చేసినట్టు స్పష్టమవుతోంది. కానీ.. రామకృష్ణ చేసిన కామెంట్ ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలకు తగిలేలా ఉండడంతో.. ఈ వ్యవహారం సైలెంట్ గా సద్దుమణుగుతుందా? లేదంటే.. రియాక్షన్ ఏమైనా ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Comedian rahul ramakrishna comments viral on tollywood background heroes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com