Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మొదటి షో నుంచే సినిమాకు అన్నీ కోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ విషయంలో నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా రేపు విడుదల చేయబోతున్నారు.
Also Read: థియేటర్లో ఫ్యామిలీతో పుష్పరాజ్ సందడి.. ఎగబడిన అభిమానులు
ఇక ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతించని కారణంగా ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు. కానీ అన్నిచోట్లా సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 95-100% టికెట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈరోజు ‘పుష్ప’రాజ్ సందడి చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ మేరకు బన్నీ ఫ్యామిలీ మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో సినిమాను చూడబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా మేనేజర్ శరత్ చంద్ర వెల్లడించారు. కాగా ఆర్య, ఆర్య-2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది.
Also Read: పుష్ప టీమ్‌కు ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పెషల్ విషెస్.. తగ్గేదెలే అంటూ ట్వీట్
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Allu arjun going to watch pushpa movie along with his family members
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com