https://oktelugu.com/

Allu Arjun : రాబోయే 10 సంవత్సరాల వరకు అల్లు అర్జున్ ఇండియాలో టాప్ హీరో గా ఉండబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 30, 2024 / 10:44 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ల సినిమాలతో మంచి విజయాలను సాధించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నారనే చెప్పాలి… మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి భారీ గుర్తింపును తీసుకురావాలనే ఉద్దేశ్యంతో వాళ్లు మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు…

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తెలుగు సినిమా హవా అనేది కొనసాగుతుందనే చెప్పాలి. బాహుబలి 2 సినిమాతో ఎంతటి పెను రికార్డ్లైతే క్రియేట్ అయ్యాయో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఆ భారీ రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డు లు క్రియేట్ అవుతూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అల్లు అర్జున్ యావత్ నార్త్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళందర్నీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధించడమే కాకుండా దాదాపు మరొక పది సంవత్సరాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి…

    ఇక తన తదుపరి సినిమాలు పెద్దగా సక్సెస్ ని సాధించకపోయిన కూడా ఈ ఒక్క సక్సెస్ తో ఆయన చాలా సంవత్సరాల పాటు తన ఫ్యాన్ బేస్ ను కాపాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి ‘పుష్ప 2’ సినిమా నార్త్ లో రూరల్ ఏరియా లో ఉన్న ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. వాళ్లు మాత్రమే సినిమాను రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు.

    కాబట్టి వాళ్ల నుంచి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ సినిమా భారీ రేంజ్ లో వసూళ్లను రాబడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరగడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మీద భారీ అంచనాలు పెరగడమే కాకుండా సినిమాల కోసం అక్కడి అభిమానులు ఎదురుచూసే రోజులు కూడా వచ్చాయి.

    మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని గెలుచుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ అవార్డు ను కైవసం చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ప్రస్తుతం అల్లు అర్జున్ కి నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా అల్లు అర్జున్ ఒక చరిత్ర సృష్టించాడనే చెప్పాలి…