AP Pensions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు భరోసా కల్పించేలా వ్యవహరిస్తోంది. తాజాగా పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల ఉన్న పింఛన్ మొత్తం.. నాలుగు వేల రూపాయలకు పెంచారు. ప్రతినెలా అందిస్తూ వస్తున్నారు. అయితే జనవరి నెల కు సంబంధించి ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పల్నాడు జిల్లాలో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే గత ఏడు నెలలుగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతోంది. ఒకవేళ ఒకటో తేదీ సెలవు వచ్చినా, పండుగలు ఉన్నా.. ముందు రోజు పింఛన్ల పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి నెల కు సంబంధించి సచివాలయ ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
* సెలవు కావడంతో
జనవరి 1 సాధారణ సెలవు దినం. పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నత అధికారులను కలవాల్సి ఉంటుంది. ప్రజా ప్రతినిధులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతారు. దీంతో ఆ రోజు పింఛన్ల పంపిణీ చేయడం కుదరదు. అందుకే ఒక రోజు ముందుగా పంపిణీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల నుంచి వినిపించింది. సచివాలయ ఉద్యోగుల సైతం ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఒకరోజు ముందు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరగనుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించనున్నారు.
* సీఎం టూర్ షెడ్యూల్ ఖరారు
సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా నరసారావుపేట నియోజకవర్గంలోని ఎలమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ప్రతి నెల ఒకటో తేదీన ఏదో ఒక జిల్లాకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్తో పాటు ఇతర మంత్రులు సైతం పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో పింఛన్ల పంపిణీకి హాజరవుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఇప్పటికే జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.