https://oktelugu.com/

Pushpa 2: The Rule : సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టిన అల్లు అర్జున్.. అక్టోబర్ దాటిందంటే ఇక లేనట్టే.. ‘పుష్ప 2’ కి సరికొత్త చిక్కులు!

ఎట్టకేలకు సుకుమార్ ఈ సినిమాని చెక్కి చెక్కి ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా పూర్తి చేసాడు. సెకండ్ హాఫ్ కి సంబంధించి 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఎట్టిపరిస్థితిలో ఈ షూటింగ్ అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చెయ్యాలని అల్లు అర్జున్ సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2024 / 05:38 PM IST

    Pushpa

    Follow us on

    Pushpa 2: The Rule : ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో తెలుగు ఆడియన్స్ తో ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మార్కెట్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి 2 కి అప్పట్లో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉండేదో, ‘పుష్ప 2’ చిత్రానికి కూడా అలాంటి క్రేజ్ ఉంది. అంచనాలు శృతి మించడం తో డైరెక్టర్ సుకుమార్ ఆ అంచనాలను అందుకునేందుకు పుష్ప 2 చిత్రాన్ని సానపెడుతున్నాడు. తీసిన సన్నివేశాన్నే మళ్ళీ మళ్ళీ తీస్తూ, తన పర్ఫెక్ట్ గా అనిపించేంత వరకు తగ్గేదే లే అని అంటున్నాడు. కానీ షూటింగ్ ఆలస్యం అయ్యే కొద్దీ అల్లు అర్జున్ కి కోపం పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన మూడేళ్ళ సమయాన్ని కేటాయించాడు. ఆయన కోసం పాన్ ఇండియన్ డైరెక్టర్స్ అట్లీ, సందీప్ వంగ వంటి వారు లైన్ లో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేస్తూండేలోపు అల్లు అర్జున్ కి కోపం వచ్చి, గెటప్ మార్చేసి ఫారిన్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిర్మాతలు రిక్వెస్ట్ చేసి హీరో, డైరెక్టర్ మధ్య సయోధ్య కుదిరించి మళ్ళీ షూటింగ్ ని ప్రారంభించారు.

    ఎట్టకేలకు సుకుమార్ ఈ సినిమాని చెక్కి చెక్కి ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా పూర్తి చేసాడు. సెకండ్ హాఫ్ కి సంబంధించి 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఎట్టిపరిస్థితిలో ఈ షూటింగ్ అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చెయ్యాలని అల్లు అర్జున్ సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. అక్టోబర్ లో షూటింగ్ ఫినిష్ అయితే కానీ,ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదలయ్యే పరిస్థితి లేదు. అందుకే అల్లు అర్జున్ షూటింగ్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ షూటింగ్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. ఆయనకీ సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. కానీ ఆయన మంచి బిజీ ఆర్టిస్టు అవ్వడం తో డేట్స్ సర్దుబాటు కావడం లేదు.

    అక్టోబర్ లో కూడా ఆయన డేట్స్ దొరకడం కష్టమే అని అంటున్నారు. ఇప్పుడు మేకర్స్ ఇది పెద్ద సమస్య. ఆయన డేట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అక్టోబర్ 20 నుండి అయినా డేట్స్ ఇవ్వమని కోరుకుంటున్నారు. ఆయన డేట్స్ ఆ సమయానికి సర్దుబాటు చేస్తే పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6 న విడుదల అవుతుంది. లేకుంటే వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఈ సినిమా అనుకున్న తేదికి వస్తుందా లేదా అనేది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణ కోసం మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు.