Allu Arjun : గంగోత్రి(Gangothri) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు అల్లు అర్జున్(Allu Arju)… ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి ఆయనకు పెద్దగా ఇమేజ్ అయితే రాలేదు. ఇక ఆర్య (Arya) సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఆయన చేసిన పుష్ప (Pushpa 2) సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు కూడా అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసి ఆయన కంటే ఒక్క అడుగు ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
మరి వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారనే విషయం మీదనే సినిమా యొక్క రికార్డ్స్ అనేవి ఆధారపడి ఉన్నాయి. ఇక ప్రభాస్ లాంటి హీరో ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఆయనకు ఈ రికార్డులను ఈజీగా బ్రేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక అతనితో పాటుగా రామ్ చరణ్ (Ram Charan) సైతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది (Peddi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో సైతం ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండియాలో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసే కెపాసిటి ఉందనే చెప్పాలి.
ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో సైతం క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో రాజమౌళితో చేస్తున్న సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం వీళ్ళందరి కంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. మరి తన రికార్డును బ్రేక్ చేసి వీళ్ళు కూడా అతనితో పోటీపడుతూ నెంబర్ వన్ రేస్ లో ఉంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో మరో హీరో తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్…