నిర్మాణ రంగంలోకి అల్లు అర్జున్.. తొలుత వెబ్ సీరిస్? 

మెగా హీరోల్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ప్రత్యేకమైనది. మెగాస్టార్ డ్యాన్సులకు అల్లు అర్జున్ వారసుడని ఇండస్ట్రీలో పేరుంది. మాస్.. క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ అల్లు అర్జున్ టాలీవుడ్ తోపాటు మల్లువుడ్లో టాప్ హీరోగా దూసుకెళుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. అల్లు ఫ్యామిలీకి గీతా ఆర్ట్స్ […]

Written By: NARESH, Updated On : November 7, 2020 11:17 am
Follow us on

allu arjun

మెగా హీరోల్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ప్రత్యేకమైనది. మెగాస్టార్ డ్యాన్సులకు అల్లు అర్జున్ వారసుడని ఇండస్ట్రీలో పేరుంది. మాస్.. క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ అల్లు అర్జున్ టాలీవుడ్ తోపాటు మల్లువుడ్లో టాప్ హీరోగా దూసుకెళుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. అల్లు ఫ్యామిలీకి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. తాజాగా అల్లు స్టూడియో నిర్మాణానికి కూడా అల్లు హీరోలంతా శ్రీకారం చుట్టిన సంగతి తెల్సిందే. ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుండగానే అల్లు అర్జున్ సైతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు సన్నహాలు చేసుకుంటున్నాడు.

Also Read: రిస్క్ చేస్తున్న మంచు మనోజ్ !

అల్లు అర్జున్ తొలుత వెబ్ సీరిస్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. బన్నీ స్థాయికి సినిమా నిర్మాణమైనా.. వెబ్ సీరిస్ నిర్మాణమైన పెద్ద కష్టమేమీ కాదు. అల్లు అర్జున్ కు గీతా ఆర్ట్స్ బ్యానర్ తోపాటు బన్నీ వాసు సపోర్టు ఉండనే ఉంది. దీంతో అతడికి నిర్మాణ రంగంలో పెద్దగా
కష్టాలేమి ఉండకపోవచ్చు. అయితే ఆయన తొలుత సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ నిర్మాణంపైనే మొగ్గుచూపడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: మెగాస్టార్ అనుచరుడిగా సత్యదేవ్ !

బన్నీ టీం వెబ్ సిరీసు కోసం ఇప్పటికే పలు కథలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. కథల విషయంలో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ వెబ్ సిరీస్ సమర్పిస్తున్నడంటే మాత్రం ఓ స్టాండర్డ్ ఉండాల్సిందే. ఇప్పటికే తెలుగు వెబ్ సిరీసులు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. బన్నీ అయినా స్టాండర్డ్ వెబ్ సిరీసుతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాడో లేదో వేచిచూడాల్సిందే. దీపావళికి దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.