https://oktelugu.com/

ముప్పు తప్పదు: కరోనా ఇక తగ్గే అవకాశాలు తక్కువేనా..! 

చైనాలోని వూహాన్‌లో కరోనా పుట్టి దాదాపు ఏడాది కావస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నది. గత మార్చిలో ఇండియాలో ఎంట్రి ఇవ్వడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదై ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరింది. అయితే గత నెలలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఇక ఈ వైరస్‌ భారత్‌ను విడిచిపెట్టే అవకాశాలున్నాయని అందరూ భావించారు. కానీ వింటర్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతిరోజు 40 వేలకు పైగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 11:09 am
    Follow us on

    Corona india

    Carona india

    చైనాలోని వూహాన్‌లో కరోనా పుట్టి దాదాపు ఏడాది కావస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నది. గత మార్చిలో ఇండియాలో ఎంట్రి ఇవ్వడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదై ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరింది. అయితే గత నెలలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఇక ఈ వైరస్‌ భారత్‌ను విడిచిపెట్టే అవకాశాలున్నాయని అందరూ భావించారు. కానీ వింటర్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతిరోజు 40 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    దేశంలో చలికాలం ప్రారంభం కావడంతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ను దాటి థర్డ్‌వేవ్‌గా విస్తరిస్తోందని వైద్య అధికారులు చెబతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా మరణాల రేటు తక్కువగా ఉండడంతో కాస్త ఉపశమనం కలిగిస్తోందని అంటున్నారు.  కరోనా సోకిన వారిలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గితే మాత్రం ప్రమాదమేనని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Also Read: కరోనా బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రోజుకు 2,930 రూపాయలు..?

    కరోనా ప్రారంభంలో కేరళలో కొన్నిరోజులు వ్యాపించి ఆ తరువాత జీరోస్థాయికి పడిపోయింది. దీంతో కేరళ సేఫ్‌ జోన్‌లో ఉందనుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇటీవల వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అన్‌లాక్‌కు ప్రకటించడంలో ప్రజలు పండుగలు, ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించకుండా పాల్గొనడంతో ఈ వ్యాప్తి ఎక్కువైందని కొందరు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే ఆ రాష్ట్రంలో 2.20 లక్షల కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీవాళి పండుగపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలో బాణసంచా కాలుస్తే లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రకటించారు. దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యంతో శ్వాస ఇబ్బందులు తీవ్రమవుతాయని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్‌ లాంటి ప్రభుత్వాలు బాణసంచాల కాల్చడంపై నిషేధాన్ని విధించారు.

    Also Read: అమెరికాలో నవంబర్‌లోనే ఎన్నికలు ఎందుకు..? 1845కు ముందు ఏం జరిగింది..?

    ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు వైద్య అధికారులు కరోన వైరస్‌ వ్యాప్తి ఇంకా తొలిగిపోలేదని, మరింత విజృంభించే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అంతేకాకుండా నాలుగో దశ కూడా ప్రారంభమై కరోనా విజృంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం నవంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలు మరికొంతకాలం జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక దూరం మెయింటేన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు