Pushpa 2 : గత ఏడాది డిసెంబర్ 5 ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఆ రోజున ఒక తెలుగు సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, మొదటి రోజే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగలదని నిరూపించింది. అంతే కాకుండా మొదటి వారం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా మన తెలుగు సినిమా దాటగలదు అని, బాలీవుడ్ మేకర్స్ మనల్ని అందుకోవడం అసాధ్యమని నిరూపించింది. 100 ఏళ్ళ బాలీవుడ్ చరిత్ర లో హిందీ సినిమా కాకుండా, ఒక తెలుగు సినిమా హిందీలోకి డబ్ అయ్యి, అక్కడి సినిమాల రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వగలదని మన సత్తా చాటేందుకు ముహూర్తం పడిన దినమది. అదే ‘పుష్ప 2 : ది రూల్’. తెలుగు సినిమాలను తక్కువ చూపుతో చూసే కొంతమంది బాలీవుడ్ మేకర్స్ కి ఈ చిత్రం ఒక పీడకల లాంటిది.
ఆ సినిమా పేరు చెప్తేనే గజగజ వణికిపోతారు, ఆ రేంజ్ సునామీ ని నెలకొల్పింది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమా బాలీవుడ్ లో అన్ని ప్రధాన సిటీలలో అత్యదిక థియేటర్స్ లో ప్రదర్శితమవుతుందంటే ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. రేపు ఈ సినిమాకి సంబంధించిన రీ లోడెడ్ వెర్షన్ విడుదల కాబోతుంది. ఎడిటింగ్ లో తొలగించబడ్డ 20 నిమిషాల సన్నివేశాలను జత చేస్తూ, రేపు ఈ సరికొత్త వెర్షన్ మన ముందుకు రానుంది. ఈ 20 నిమిషాల ఫుటేజీ కి అల్లు అర్జున్ ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పాడు. అంటే ఈ వెర్షన్ కూడా దుమ్ము లేపేస్తుందని ఆయన బలమైన నమ్మకం. ఇదంతా పక్కన పెడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి 2 ఫుల్ రన్ వసూళ్లను కూడా దాటేసిన ఈ చిత్రం, కేవలం ఒకే ఒక్క సినిమాని మాత్రం దాటలేదు.
అదే అమీర్ ఖాన్ హీరో గా నటించిన ‘దంగల్’ చిత్రం. 2016 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా, అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. కొన్ని రోజుల తర్వాత ఈ చిత్రాన్ని చైనా భాషలోకి దబ్ చేసి విడుదల చేసారు. ఏకంగా 2000 కోట్ల రూపాయలకు వసూళ్లు ఎగబాకింది. ‘పుష్ప 2 ‘ ప్రస్తుతానికి 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘దంగల్’ ని కేవలం ఇండియన్ బాషలతో అందుకోవాలంటే కష్టమే. అందుకే త్వరలో ఈ చిత్రాన్ని చైనా లో కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గానే విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రం అక్కడ విడుదలై వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2 ఎంత రేంజ్ వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి.