Dil Raju : ఈ సంక్రాంతికి నిర్మాత దిల్ రాజు అదృష్టం మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఎంతో ఖర్చు చేసి, భారీ హంగులతో ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. డబ్బులు ఈ సినిమా కోసం దిల్ రాజు మంచి నీళ్లు లాగా ఖర్చు చేశాడు. పాటల కోసం డైరెక్టర్ శంకర్ ఆయన చేత అనవసరంగా ఖర్చు చేయించాడు. పాపం ఇక దిల్ రాజు పని అయిపోయినట్టే, ఒకవేళ ఆయన రెండవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయినా కూడా ‘గేమ్ చేంజర్’ మిగిలిచిన నష్టాలను పూడవలేదని విశ్లేషకులు మాట్లాడుకున్నారు. కానీ ఆ చిత్రమే దిల్ రాజు పాలిట ‘గేమ్ చేంజర్’ గా మారి, ఆయన కొంప కొల్లేరు కాకుండా చేసింది అని చెప్పొచ్చు. ఈ చిత్రం నేటితో మూడు రోజులు పూర్తి చేసుకుంది.
2 రోజుల్లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 66 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా బిజినెస్ కేవలం 41 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. అంటే కోటి రూపాయిలు వస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసినట్టు అన్నమాట. మూడవ రోజులోకి అడుగుపెట్టే సమయానికి బయ్యర్స్ కనీసం 13 కోట్ల రూపాయిల లాభాలతో ఉంటారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని బయ్యర్స్ కి గేమ్ చేంజర్ తో కలిపి అమ్మాడు. ‘గేమ్ చేంజర్’ కి నష్టపోయిన బయ్యర్లు ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా లాభాలను అందుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు కి ‘గేమ్ చేంజర్’ ని నిర్మించేందుకు 300 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకు ఆ సినిమాకి ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 105 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మూడు రోజుల్లో 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఆయన జోబులోకి ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయిలు వెళ్ళింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఊపు ని చూస్తుంటే మొదటి వారం లో వంద కోట్ల రూపాయిల షేర్, ఫుల్ రన్ లో 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే సినిమాలాగా అనిపిస్తుంది. అంటే మరో వంద కోట్ల రూపాయిల షేర్ అదనంగా రానుంది అన్నమాట. ‘గేమ్ చేంజర్’ నుండి మహా అయితే మరో 10 నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయి. ఈ రెండు కలిపితే దిల్ రాజు బ్యాలన్స్ షీట్ అటు నష్టం లేక, ఇటు పూర్తి స్థాయి లాభాలు లేక ఉండబోతుంది అన్నమాట. అయితే ఆయన ఇప్పటికే డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా భారీ లాభాల్లోనే ఉన్నాడు. మొత్తానికి 10 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం దిల్ రాజుని కాపాడింది.