Lulu Mall Land Vizag: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు కంపెనీ( Lulu company) ముందుకు వచ్చింది. విశాఖలో షాపింగ్ మాల్ పెట్టేందుకు సిద్ధపడింది. అయితే లులు మాల్ కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనే లులు మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం తర్వాత లులు మాల్ కు నామమాత్రపు ధరతో 13.83 ఎకరాలను కేటాయించారు. అయితే రైతులకు చెందిన భూములను ఎలా కేటాయిస్తారు అంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. తాజాగా అవి విచారణకు వచ్చాయి.
Also Read: LuLu Group: ‘లులూ’ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఈ సంస్థల ప్రత్యేకతలు ఏంటి?
13 ఎకరాలకు పైగా కేటాయింపు..
విశాఖలో లులు గ్రూప్ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల ( hypermarkets )నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూ కేటాయింపులు చేయాలని ఆదేశించింది. విశాఖ బీచ్ రోడ్డు లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీ బదలాయించాలని ప్రభుత్వం వి ఎం ఆర్ డి ఏ కు ఆదేశాలు జారీచేసింది. దీనిపైనే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు కోర్టును కొద్ది నెలల కిందట ఆశ్రయించారు. ఇప్పుడు ఆ కేసు విచారణకు వచ్చింది. రైతుల తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు.
Also Read: Vizag Steel Plant: కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
2017 లోనే ఎంట్రీ..
2017లో లులు గ్రూప్ విశాఖ బీచ్ రోడ్డు లోని హార్బర్ పార్కులో( Harber Park) అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో ఆ సంస్థ పెట్టుబడులను వెనక్కి తీసుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. గతంలో కేటాయించిన భూములనే కూటమి ప్రభుత్వం కొనసాగించింది. ఈ క్రమంలో ఈ భూముల కేటాయింపు పై పిల్ దాఖలయింది. తాజాగా విచారణ కు వచ్చింది. లులు మాల్ కు సంబంధించి బిడ్లు ఆహ్వానించకుండా.. సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని పిటిషనర్ పరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే అవన్నీ ప్రైవేటు భూములు అని.. ప్రభుత్వ భూములుగా చిత్రీకరిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. కోర్టులో పిటిషన్లు వేయడంతో తీర్పులు వచ్చేవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరపవద్దని కోరారు. అయితే కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే మరోసారి లులు భూముల వ్యవహారం వివాదానికి దారి తీసే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.