Robin Hood Movie First Review (1)
Robin Hood Movie First Review: యూత్ ఆడియన్స్ లో మొదటి నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో ఒకరు నితిన్(Actor Nithin). ఆయన కెరీర్ ఎలా ఒడిదుగులను ఎదురుకుందో మనమంతా చూసాము. ఒకానొక దశలో వరుసగా 12 ఫ్లాపులు రావడంతో ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆయనకు ఇష్క్ చిత్రం ద్వారా మళ్ళీ హీరో గా పునర్జన్మ వచ్చినట్టు అయ్యింది. ఈ సినిమా తర్వాత నితిన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఒకానొక దశలో స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడని అందరూ భావించారు. అలా అనుకున్న ప్రతీసారి వరుసగా రెండు డిజాస్టర్ సినిమాలను అందుకొని రేస్ నుండి వైదొలుగుతూ వస్తున్నాడు. ఆయన కెరీర్ మొత్తం ఇలాగే సాగింది. నితిన్ నుండి వచ్చిన చివరి సూపర్ హిట్ చిత్రం భీష్మ. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
Also Read: విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఎన్ని పాట్లు పడ్డాడో తెలుసా..? ఆడిషన్ వీడియో వైరల్
దీంతో నితిన్ కెరీర్ మళ్ళీ రిస్క్ లో పడింది. ఇప్పుడు అర్జెంటు గా ఆయనకు ఒక హిట్ కావాలి. ఆ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) రూపం లో వస్తుందని నితిన్ చాలా బలమైన నమ్మకంతో ఉన్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన మాటలు చూస్తే, కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడని అనిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని కొంతమంది మీడియా ప్రముఖులకు, అదే విధంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన బయ్యర్స్ కి ప్రత్యేకంగా ప్రివ్యూ షో వేసి చూపించారట. నితిన్ గత రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో, ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్స్ కి కొనుగోలు చేయడానికి బయ్యర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో నితిన్ వాళ్లకు ఒక ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేసి చూపించాడు.
బయ్యర్స్ కి ఈ చిత్రం తెగ నచ్చేసింది. టీజర్ ని చూసి రొటీన్ సబ్జెక్టు అనుకున్నామని, కానీ సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత వేరే ట్రాక్ లోకి వెళ్లి, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, కామెడీ అయితే అనేక సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా ఉందని, అంతే కాకుండా ఎమోషనల్ సన్నివేశాలను కూడా డైరెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడని, నితిన్ కెరీర్ లో ఈ చిత్రం ది బెస్ట్ గా ఉండిపోతుందని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పారట. ముఖ్యంగా కామెడీ ట్రాక్ ఈ సినిమాలో కుదిరినంతగా, ఇటీవల కాలం లో ఏ సినిమాకు కుదర్లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో ఉన్న కామెడీ కంటే, ఈ సినిమాలో ఉన్న కామెడీ నే బాగా పేలిందని అంటున్నారు. సినిమా ఈ రేంజ్ లో నిజంగా ఉంటే మాత్రం నితిన్ కూడా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.