Allu Arjun and Trivikram : ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఎలాంటి పాత్ర అయినా చేయగల టాలెంట్ ఉన్న వారిలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాన్ ఇండియా లెవెల్ లో ఆయన పై దర్శక నిర్మాతలు ఎలాంటి ప్రయోగాన్ని అయినా చేయొచ్చు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి, తాను తప్ప ఆ పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరు అనే రేంజ్ లో నటించడం అల్లు అర్జున్ స్టైల్. పుష్ప పాత్ర అందుకు ఒక ఉదాహరణ. స్టోరీ పెద్దగా లేని సినిమాకి థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి మూడు గంటల ఎంటర్టైన్మెంట్ ని అందించడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది నాల్గవ సినిమా అని చెప్పొచ్చు.
ఈ చిత్రానికి సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారట. మైథాలజీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సుబ్రమణ్య స్వామి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ అఘోరా గా కనిపించబోతున్నాడట. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. త్రివిక్రమ్ కి మన మైథాలజీ మీద ఎంత పట్టు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన మన మైథాలజీ గురించి మాట్లాడుతుంటే అలా ఎన్ని గంటలైనా ఓపిగ్గా కూర్చొని వినాలని అనిపిస్తుంది. అంత గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన. తనకి అంతటి పట్టు ఉన్న సబ్జెక్టు మీద ఇన్ని రోజులు సినిమా తీయలేదు. ఇప్పుడు దేశం మొత్తం ఇలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న సమయంలో, ఆయన ఆ జానర్ లోకి అడుగుపెట్టాడు. ఇక విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం.
ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థం లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి, వచ్చే ఏడాది సమ్మర్ లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పుష్ప 2 చిత్రం తో అల్లు అర్జున్ 2000 కోట్ల రూపాయిల మార్కుని తృతిలో తప్పాడు. ఈ చిత్రం తో ఆ మార్కుని అందుకొని తన సత్తా మరోసారి చాటడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా అల్లు అర్జున్ కసితో ఈ సినిమాకోసం పని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి. ఇందులో అన్ని భాషలకు చెందిన క్రేజీ ట్రెండింగ్ స్టార్స్ కూడా నటించబోతున్నారని తెలుస్తుంది. ఉగాది రోజున పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు.