Allu Arha: పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ వెలకట్టలేనిది. వాళ్ళ సంతోషం కోసం పేరెంట్స్ త్యాగాలకు సిద్ధపడతారు. సంపదతో సంబంధం లేకుండా తమకు ఉన్నంతలో అత్యుత్తమ జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల ప్రేమకు ఎల్లలు ఉండవు. దానికి సెలెబ్రిటీలు, టాప్ స్టార్స్ కూడా అతీతులు కాదు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఎప్పుడూ షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండే ఈ టాప్ స్టార్, ఖాళీ సమయం దొరికితే చాలు కొడుకు అయాన్, కూతురు అర్హతో ఆటల్లో మునిగిపోతారు.

ముఖ్యంగా అర్హనే తన ప్రపంచంగా బ్రతుకుతాడు బన్నీ. తన క్యూట్ మాటలకు మురిసిపోయే ఆయన, అర్హతో వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటాడు. అంతటి ప్రియమైన తన లిటిల్ ప్రిన్స్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు. కూతురుకి ఇష్టమైన బహుమతులతో ఆరోజు ఇల్లు నిండిపోతుంది. ఎక్కడ, ఎంత బిజీగా ఉన్నా.. అర్హ పుట్టినరోజు వేడుకల కోసం ఇంటికి వాలిపోతారు బన్నీ. కాగా అర్హ 5వ పుట్టినరోజు వేడుకలను మరింత ప్రత్యేకంగా జరిపారు.
అర్హ పుట్టినరోజు వేడుకలకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా వేదిక అయ్యింది. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే అందమైన భవనంలో అర్హ పుట్టినరోజు వేడుకలు మిన్నంటాయి. ఐదేళ్ల కూతురు పుట్టినరోజు వేడుకల కోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లడం విశేషంగా మారింది.దీంతో అర్హ పుట్టినరోజు వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కూతురు అర్హను బన్నీ ఎంత ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడో అంటూ, అందరూ చెప్పుకుంటున్నారు. అర్హ పుట్టినరోజు వేడుకలలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: Mahesh Babu: త్రివిక్రమ్- మహేశ్ కాంబో.. విలన్‌కు ఎందుకంత ప్రాధాన్యం?
కాగా అతిచిన్న వయసులోనే అర్హ వరల్డ్ రికార్డు అందుకుంది. చెస్ ఆటలో ఇప్పటికే ప్రావీణ్యత సాధించిన ఆమె, ట్రైనర్ గా కూడా మారారు. అర్హ టాలెంట్ ని గుర్తించిన నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ‘వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్’ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది అర్హ సాధించిన అరుదైన రికార్డు అని చెప్పాలి. ఇక సమంత హీరోయిన్ గా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంతో అర్హ వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Bheemla Nayak: పవన్ నిర్మాతకు రాజమౌళిపై కాలినట్లు ఉంది, వార్నింగ్ ఇస్తున్నాడుగా!