Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని రోజురోజుకు అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత తన కొడుకు బారసాల అంటూ కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. అందుకు కార్తీక్ కోపడటంతో దీప తన కుటుంబం మొత్తాన్ని బారసాలకి తీసుకు వస్తానని హామీ ఇస్తుంది. దీప మాటకు అందరూ షాక్ అవుతారు. ఇకపోతే దీప పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్లాలని బయలుదేరుతారు. అదే సమయంలో మోనిత రావడంతో దీప అత్తయ్య ఇక మీరు గుడికి రారు నేను పిల్లలు వెళ్తాము అంటూ బయలు దేరుతారు.
దీప పిల్లలను తీసుకొని గుడికి వెళ్ళగా కార్తీక్ సౌందర్య ఆనందరావు దీప గురించి మాట్లాడుతూ బాధపడతారు. నిజం తెలిసిన ఇలా నవ్వుతూ మాట్లాడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి అంటూ ఆనందరావు మాట్లాడగా సౌందర్య మాత్రం దానికి నిజం తెలిసినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అసలు ఏం చేయాలనుకుంది అంటూ భయపడుతుంది. దీప కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి అన్న భయంగా ఉంది అంటూ చెబుతుంది. ఆ మాటలకు కార్తీక్ నేను తనకి నిజం చెప్పేస్తాను మమ్మీ కొంచమైనా టెన్షన్ తగ్గుతుంది అంటాడు
ఇక మోనిత తన ఇంటికి బయలుదేరుతూ దీప అన్న మాటలను గుర్తు చేసుకొని భయపడుతుంది. నిజం తెలిసిన తర్వాత దీప అస్తమించిన సూర్యుడు మాదిరి కృంగి పోతుంది అనుకుంటే నాకే ఇలాంటి షాక్ ఇచ్చింది అంటూ కంగారు పడుతుంది. అయినా నా వైపు ఆనందరావు ఉన్నారు. నేను విజయం ముంగిట్లో ఉన్నాను నాకేమీ కాదు అంటూ తనకు తానే సర్దిచెప్పుకొని ఇంటికి వెళ్తుంది.
ఇక గుడికి వెళ్ళిన దీప పిల్లలతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడుతుంది.ఈ టైంలో డాడీ వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అమ్మా అంటూ పిల్లలు అనగా మీ డాడీకి వేరే పనులు ఉన్నాయి చాలా బిజీగా ఉన్నారు అంటూ మాట్లాడుతుంది. ఇక గుడి నుంచి పిల్లలను రెస్టారెంట్ కి తీసుకువెళ్లి వారికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసి తినమని చెబుతుంది దాంతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంటికి పిల్లలు మాత్రమే తిరిగి వస్తారు.దీంతో కంగారుపడిన కార్తీక్ కుటుంబం అమ్మ ఏది అని అడగడంతో అమ్మ వెళ్ళిపోయింది కదా అని సమాధానం చెప్పగా అందరూ ఒక్కసారిగా ఏంటి అని ప్రశ్నిస్తారు.అమ్మ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది రేపు మీరు అందరూ ఎక్కడికో వెళ్తారంట కదా అక్కడికి వస్తానని చెప్పిందని సమాధానం చెప్పి పిల్లలపై కి వెళ్తారు. పిల్లల మాటలు విన్న సౌందర్య భయపడి దీపకి ఫోన్ చేయమని చెబుతుంది. అప్పటికే దీప ఫోన్ స్విచాఫ్ రావడంతో కార్తీక్ కంగారు పడ్డాడు. అయితే చివరికి దీప ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతోందో తెలియాల్సి ఉంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Karthika deepam deepa give shock to the everyone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com