Allu Arjun: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ మరో సినిమాకి రెడీ అయ్యాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అయితే, ఈ సినిమాలో ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.

కాబట్టి.. తర్వాత సినిమా పై బన్నీ దృష్టి పెట్టాడు. నిజానికి వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఐకాన్’ ఉంటుందని ఆ మధ్య హడావిడి నడిచినా అది లేదు అని తేలిపోయింది. కాబట్టి.. తర్వాత సినిమా బోయపాటితోనే అని టాక్ నడుస్తోంది. ‘సరైనోడు’ లాంటి సూపర్ హిట్ సినిమా బోయపాటి తనకు ఇచ్చాడు. కాబట్టి తనకు సరైన దర్శకుడు బోయపాటినే అని బన్నీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
కానీ అల్లు అరవింద్ మాత్రం ఇంకా ఈ కాంబినేషన్ ను ఫైనల్ చేయలేదు. బోయపాటితో బన్నీ సినిమా గురించి ఇంకా నిర్ణయించుకోలేదు అని బన్నీవాసు కూడా చెప్పాడు. బన్నీ ఓకే చెప్పినా.. అల్లు పెద్దలు అంగీకరించక పోవడానికి ముఖ్య కారణం ‘అఖండ. ’ ‘అఖండ సినిమా విడుదలైన తర్వాత దాని రిజల్ట్ ని బట్టి నిర్ణయం తీసుకుందామని అల్లు అరవింద్ చెప్పినట్లు తెలుస్తోంది.
‘అఖండ’పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ కాబోతుంది. కాబట్టి అఖండ హిట్ అయితేనే.. అల్లు అర్జున్ – బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. అప్పుడే అల్లు అర్జున్ – బోయపాటి సినిమా గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తోంది. అయితే, ఇప్పటికే బన్నీ కోసం ఓ స్క్రిప్టును కూడా బోయపాటి సిద్ధం చేశాడు.
ఈ సినిమా ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండనుంది. కానీ బాలయ్యతో చేస్తోన్న అఖండ సినిమా రిజల్ట్ పైనే వీరి కలయిక సాధ్యం అవుతుంది. ఇక హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటి మంచి అనుభవం ఉంది. అయితే బాలయ్యతో హిట్ కొడితేనే బన్నీ డేట్లు ఇస్తాడు.