Homeఎంటర్టైన్మెంట్Rebal Star Prabhas: ప్రభాస్ బర్త్ డే కానుకగా అభిమానులకు ఓ బిగ్ అప్డేట్ ...

Rebal Star Prabhas: ప్రభాస్ బర్త్ డే కానుకగా అభిమానులకు ఓ బిగ్ అప్డేట్ …

Rebal Star Prabhas:  యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌… హీరోగా నటిస్తున్న సినిమా ” రాధేశ్యామ్‌ “. ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. అలానే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని… యూవీ క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. 1960 నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

big update announcement from prabhas radhe shyam movie

ఈ నెల 23 వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజు సంధర్భంగా… ఆరోజు ఉదయం 11. 16 గంటలకు రాధేశ్యామ్‌ టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ప్రభాస్‌ పోస్టర్‌ ను విడుదల చేస్తూ… అభిమానులకు ట్రీట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వర్తతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా సాలార్ నుంచి ఫైట్ సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే.

https://twitter.com/UV_Creations/status/1450680649577238535?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450680649577238535%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fradhe-shyam-teaser-on-oct-23rd.html

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్‌ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular