Allu Arjun: పుష్ప 2(Pushpa 2 Movie) వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ రేపిన అంశం. త్రివిక్రమ్(Trivikram Srinivas) తో ఆయన సినిమా త్వరలోనే ప్రారంభించబోతున్నాడు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కథని ప్రిపేర్ చేయడానికి త్రివిక్రమ్ ఇంకా కాస్త సమయం తీసుకుంటున్నాడు. కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చు. ఈలోపు తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తో సినిమాని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఎందుకంటే ఆయన ఇక నుండి ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ రెండు సినిమాలను విడుదల చేయాలని, లేనిచో కనీసం ఒక్క సినిమా అయినా తన నుండి విడుదల చేయాలని ఒక నియమం పెట్టుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే ముందుగా ఆయన అట్లీ చిత్రాన్ని మొదలెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కంటే ముందుగా అట్లీ తో చేయబోయే సినిమా గురించే అప్డేట్స్ వస్తున్నాయి.
ముందుగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తాడని టాక్ వినిపించింది, కానీ అల్లు అర్జున్ లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభయంకర్ ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా కాస్త పక్కన పెడితే హీరోయిన్ క్యారక్టర్ కోసం జాన్వీ కపూర్(Jhanvi Kapoor) ని ఎంచుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ కపూర్, టాలీవుడ్ లోకి ‘దేవర’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్,కోలీవుడ్ దర్శకులు జాన్వీ కపూర్ తో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ లో కూడా భాగం కానుంది.
వాస్తవానికి ‘పుష్ప 2’ లోని కిస్సిక్ పాటకు ముందుగా జాన్వీ కపూర్ ని అడిగారట. కానీ ఆమె ఐటెం సాంగ్ చేస్తే, మళ్ళీ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ రోల్ భవిష్యత్తులో ఇవ్వరేమో అనే భయం తో ఒప్పుకోలేదట. ఇప్పుడు ఆమె అంచనాలే నిజమయ్యాయి. చూడాలి మరి ఈ సినిమా తర్వాత ఆమె ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది. ‘జవాన్’ వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. జవాన్ కి పని చేసిన టీం ఈ సినిమాకి కూడా దాదాపుగా పని చేస్తారట. అట్లీ సినిమా అంటే కచ్చితంగా సమాజాన్ని కాపాడే సూపర్ హీరో లెక్కనే కథలు ఉంటాయి. ఈ సినిమా కూడా అదే జానర్ లో ఉండబోతుందని సమాచారం. ఈ ఏడాది లోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి క్రిస్మస్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.