Chhaava Movie: ‘చావా'(Chhaava Movie) చిత్రాన్ని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా?..చేసుంటే 2000 కోట్లు వసూళ్లు వచ్చేవి!బాలీవుడ్ ఆడియన్స్ తమ గర్వంగా పిలవబడే ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘చావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం మొన్ననే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని, రికార్డు స్థాయి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో అయితే మొదటి రోజు నుండి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏలిన నేల కావడంతో అక్కడి ప్రజలు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దేవుడిలాగా కొలుస్తారు. అందుకే ఆయన స్టోరీ ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలకు అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుంటారు. మొదటి రోజు 33 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. అలా కేవలం మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిలను కొల్లగొట్టే దిశగా ఈ సినిమా అడుగులేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని ముందుగా మన తెలుగు స్టార్ హీరో తో చేయాలనీ అనుకున్నారట. అది కూడా ఈమధ్య కాదు, 8 ఏళ్ళ క్రితం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తో ఈ కథ ద్వారా బాలీవుడ్ లో లాంచ్ చేయాలనీ అనుకున్నారట. కానీ మహేష్ బాబు(Super Star Mahesh Babu) బాలీవుడ్ వైపు వెళ్ళడానికి ఇష్టం లేదంటూ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. వస్తే రాజమౌళి(SS Rajamouli) సినిమాతోనే బాలీవుడ్ లోకి వస్తానని తెగేసి చెప్పాడట. అనుకున్నదే ఇప్పుడు చేస్తున్నాడు. ఒకవేళ మహేష్ బాబు 8 ఏళ్ళ క్రితం ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే ప్రభాస్ కంటే ముందుగానే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు. మహేష్ బాబు చేయను అనేసరికి కొంతకాలం లాకర్ లో పెట్టిన ఈ కథని మళ్ళీ బయటకి తీశారు.
డైరెక్టర్ లక్ష్మణ్ ఈ కథకు కొన్ని తుది మెరుగులు అద్ది, విక్కీ కౌశల్(Vicky Kaushal) తో తెరకెక్కించాడు. హీరోయిన్ గా ఆయన సతీమణి కత్రినా కైఫ్ ని తీసుకుందామని ముందుగా అనుకున్నారు కానీ, ఎందుకో ఆమె ఒప్పుకోలేదు. దీంతో అప్పుడే ‘యానిమల్’ చిత్రం తో బాలీవుడ్ ని షేక్ చేసిన రష్మిక ని ఈ చిత్రం కోసం ఎంచుకున్నారు. ఆమె పాత్రకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని హిందీ హీరోకంటే తెలుసు ఆడియన్స్ తో చేసుకుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి , మరో రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాగా నిలిచేది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే మనకి హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది కాబట్టి. హిందీ సినిమాలకు ఆ అడ్వాంటేజ్ లేదు పాపం. ఒకప్పుడు గేలి చేసిన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు బాలీవుడ్ ని మించిన ఇండస్ట్రీ గా మారిపోయింది.