https://oktelugu.com/

Today horoscope in telugu : ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం.. వద్దన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది..

Today horoscope in telugu ఈ కారణంగా ఈరోజు కొన్ని రాశుల వారికి ఆకస్మికంగా అదృష్టం కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మిగతా రాశుల వారు కొన్ని విషయాలను షేర్ చేసుకోవద్దు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written By: , Updated On : February 16, 2025 / 08:02 AM IST
Horoscope Today

Horoscope Today

Follow us on

Today horoscope in telugu : గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో అనేక మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తర ఫల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఈరోజు కొన్ని రాశుల వారికి ఆకస్మికంగా అదృష్టం కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మిగతా రాశుల వారు కొన్ని విషయాలను షేర్ చేసుకోవద్దు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఓరి వైపు ఆదాయం పెరుగుతుంది. కానీ మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆదాయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గం చేపడతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది.. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే పదోన్నతి పై ప్రభావం పడే అవకాశం ఉంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఓ సమాచారం కోసం ఎదురుచూసేవారికి నేడు అందుకుంటారు. బంధువుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. దీంతో మానసికంగా ఆందోళన చెందుతారు. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులు తాము చేసే పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు ఉద్యోగలు మారే అవకాశం ఉంది. అయితే ఇలా చేసేవారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్తగా పెట్టుబడి పెట్టే వారు పెద్దల సలహా తీసుకోవాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోరుకున్న పనులు చేయగలుగుతారు. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములతో అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని కార్యక్రమాలతో వ్యాపారులు బిజీగా ఉంటారు. ఉద్యోగులను లక్ష్యాలు పూర్తి చేయడంలో నిమగ్నం అవుతారు. ఈ రాశి వారికి కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే వారిని ఎదుర్కోవడానికి కొత్త ప్రణాళికలు చేపడతారు. చుట్టుపక్కల వారితో మాటలను అదుపులో ఉంచుకోవాలి. అనవసర వివాదాల్లో కి దూరకుండా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం. ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య నేటితో పరిష్కారం అవుతుంది. కొత్తగా వ్యాపారం చేపట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. కొత్తగా ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఉద్యోగులు కార్యాలయాల్లో అదనపు ఆదాయాన్ని పొందుతారు. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చట్టపరమైన చిక్కులు ఉంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అయితే తోటి వారు లో ఒకరు అడ్డంకులు ఏర్పరుస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టాలి. ప్రయాణాలు చేయాలనుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది.

ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. కొందరు ఆర్థికంగా మోసం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులు కొత్త వ్యక్తులు పరిచయమైతే వారికి దూరంగా ఉండడమే మంచిది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. అయితే వాటిని వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే తీవ్ర అనర్థాలకు దారి తీసే అవకాశం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడంతో ప్రశాంతంగా ఉంటారు. అయితే జీవిత భాగస్వామితో ఆగ్వాదం ఉండడంతో ఆందోళనతో గడుపుతారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తుకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి..

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. భవిష్యత్తులో వచ్చే ఆపదను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే పెట్టుబడును పెడతారు. ఇవి లాభాలను తెచ్చి పెడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక విషయాలను ఇతరులతో షేర్ చేసుకోరాదు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి ధన సహాయం చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. బంధువులతో విహారయాత్రలకు వెళ్తారు.