https://oktelugu.com/

Allu Aravind: అల్లు అరవింద్ కి ముగ్గురు కాదు, నలుగురు కొడుకులు, మరో కుమారుడు ఏమయ్యాడో తెలుసా? షాకింగ్ మేటర్ వెలుగులోకి

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే తెలుసు. పెద్ద కుమారుడు అల్లు వెంకట్ కి జనాలకు పెద్దగా తెలియదు. కాగా ఈ ముగ్గురు కాకుండా అల్లు అరవింద్ కి మరో కుమారుడు ఉన్నారు. ఆయన పేరు అల్లు కిరణ్. మరి ఆయన ఏమయ్యారు?

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 07:22 PM IST

    Allu Aravind

    Follow us on

    Allu Aravind: టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. దశాబ్దాలుగా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అద్భుతమైన చిత్రాలు చేస్తున్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ… గొప్ప అవుట్ సాధించే నిర్మాతగా ఆయనకు పేరుంది. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దబ్బాయి అల్లు వెంకట్. ఈయన పరిశ్రమకు రాలేదు. అందుకే పెద్దగా తెలియదు. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ విధంగా కొంత వెలుగులోకి వచ్చాడు.

    ఇక రెండో కుమారుడు అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నార్త్ ఇండియాలో జండా పాతిన అల్లు అర్జున్… అక్కడి సూపర్ స్టార్స్ నెలకొల్పిన రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఆ రేంజ్ లో అల్లు అర్జున్ ప్రభంజనం ఉంది. ఇక మూడో కుమారుడు అల్లు శిరీష్. ఈయన కూడా హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

    అల్లు శిరీష్ కి బ్రేక్ రాలేదు. ఫేమ్ రాబట్టలేకపోయాడు. అల్లు శిరీష్ కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాడు. కాగా అల్లు అరవింద్ కి ఈ ముగ్గురు కాకుండా మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టాడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ … అల్లు వెంకట్ అన్నయ్య తర్వాత అల్లు కిరణ్ పుట్టాడు. అయితే ఆయన ఐదేళ్ల ప్రాయంలోనే ఒక ప్రమాదంలో కన్నుమూశాడట. బాల్యంలో చనిపోవడం వలన అల్లు కిరణ్ గురించి కుటుంబ సభ్యులు ఎక్కడ ప్రస్తావించరు అట. కాబట్టి అల్లు అరవింద్ కి నలుగురు కుమారులు కాగా.. ఒక అబ్బాయి బాల్యంలోనే కన్నుమూశాడు.

    ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం అల్లు అరవింద్ ని ఒకింత ఉక్కిరిబిక్కిరి చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఒకరోజు జైలు జీవితం గడిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై వ్యతిరేకత వ్యక్తమైంది.