https://oktelugu.com/

Allu Aravind: రామాయణం డైరెక్టర్ నితీశ్ తివారీ పైన కేసు వేసిన అల్లు అరవింద్.. అసలేం జరిగిందంటే…

రామాయణం సినిమా మీద రీసెంట్ గా అల్లు అరవింద్ కేసేశాడు. నితీశ్ తివారీ ఇంతకుముందు రామాయణం స్టోరీని అల్లు అరవింద్ కి చెప్పారట.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 02:15 PM IST

    Allu Aravind filed a case against Ramayana director Nitish Tiwari

    Follow us on

    Allu Aravind: బాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడుగా పేరుపొందిన నితీశ్ తివారీ ప్రస్తుతం రణ్బీర్ కపూర్ ను రాముడు గా, సాయిపల్లవిని సీతగా పెట్టి ‘ రామాయణం ‘ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద రీసెంట్ గా అల్లు అరవింద్ కేసేశాడు. నితీశ్ తివారీ ఇంతకుముందు రామాయణం స్టోరీని అల్లు అరవింద్ కి చెప్పారట.

    దాంతో ఆయన రామాయణం అనే సినిమా టైటిల్ ని కూడా రిజిస్ట్రేషన్ చేయించానని కానీ ఇప్పుడు నాకు తెలియకుండా నాతో కాకుండా వేరే వాళ్ళతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని డైరెక్టర్ మీద చీటింగ్ కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక రామాయణం సినిమా షూటింగ్ ప్రస్తుతానికైతే ఆగిపోయింది. మరి ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక నిర్ణయాన్ని కోర్టు తెలియజేసిన తర్వాతనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందా లేదా అని విషయాలు తెలుస్తాయి.భారీ హంగులు ఆర్భాటాలతో స్టార్ట్ చేసిన రామాయణం ప్రస్తుతానికి నిలిపేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రణ్బీర్ కపూర్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారు… అయితే గత నాలుగు సంవత్సరాల కిందట రామాయణం పేరుతో అల్లు అరవింద్ ఒక పేరునైతే రిజిస్ట్రేషన్ చేయించాడు.

    ఇక అప్పుడు రామ్ చరణ్ ఇందులో హీరోగా చేయబోతున్నాడు అని అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా చేశాడు. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా ముందుకు రాలేదు. ఇక ఈ ప్రాజెక్టు ఇప్పుడు నితీష్ తివారి బాలీవుడ్ లో చేయడంతో అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఆ రన్బీర్ కపూర్ రీసెంట్ గా అనిమల్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రన్బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ గా హిట్ నిలిచింది.

    ఇక ఇప్పుడు రామాయణం సినిమాతో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవాలని తను ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు రణ్బీర్ కపూర్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.మరి ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ ఇప్పుడు ఇంకో సినిమా మీదకి మళ్ళిస్తాడా కోర్ట్ నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…