Site icon OkTelugu

Raja Saab: రాజాసాబ్ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదుగా… కనీసం టీజర్ అయిన వదులు సామి…

Prabhas Raja Saab Movie Latest Updates

Prabhas Raja Saab Movie Latest Updates

Raja Saab: మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్ సినిమా నుంచి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయింది. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది అనే విషయాన్ని తెలియజేయడం లేదు. అయితే దాదాపు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతున్నప్పటికీ దీని మీద సరైన క్లారిటీ ఏది రావడం లేదు.

ఇక ఇప్పుడు చూస్తుంటే ఈ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి ‘ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘స్పిరిట్ ‘ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇక అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 సినిమాని కూడా తొందర్లోనే పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ మొత్తాన్ని లాక్ చేసి సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే సెట్స్ ని కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతితో చేసే సినిమాకి డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడు అనే దానిమీద పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి కనీసం టీజర్ అయిన వదలమని ప్రభాస్ అభిమానులు మారుతిని వేడుకుంటున్నారు. కానీ మారుతి మాత్రం ఒక్క పోస్టర్ తప్ప ఇంతవరకు ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదు.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను తొందర్లోనే రిలీజ్ చేయాలని మారుతి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మరింత లేట్ అయితే మాత్రం మారుతి కెరియర్ కి కొంతవరకు దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి. అసలు ఈ సినిమా గురించి మార్కెట్లో కొంచెం కూడా బజ్ అయితే లేదు. కానీ ప్రభాస్ నటిస్తున్నాడు కాబట్టి ఇది కూడా సూపర్ సక్సెస్ అవుతుందని అతని అభిమానులైతే భావిస్తున్నారు…

Exit mobile version