Ugram Movie Review: అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ ఫుల్ రివ్యూ

CI శివ కుమార్ వరంగల్ సిటీ లో ఉండే ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.ఎలాంటి క్లిష్టమైన కేసు ని అయినా, ఆయన చాలా తేలికగా పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. అలా సాగిపోతున్న శివ కుమార్ జీవితం లోకి అపర్ణ (మిర్న మీనన్) వస్తుంది.

Written By: Vicky, Updated On : May 5, 2023 12:46 pm
Follow us on

Ugram Movie Review: నటీనటులు: అల్లరి నరేష్, మిర్న మీనన్ , ఇంద్రజ తదితరులు
డైరెక్టర్ : విజయ్ కనకమేధాల
మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల
కథ : టోమ్ వెంకట్

కామెడీ హీరో గా మంచి పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్, ఇప్పుడు రూట్ మార్చి వరుసగా కంటెంట్ ఉన్న సీరియస్ జానర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.’నాంది’ సినిమాతో డైరెక్టర్ విజయ్ కనకమేధాల అల్లరి నరేష్ ని చాలా కొత్తగా చూపించాడు, ఆడియన్స్ కూడా థ్రిల్ కి గురి అవ్వడం తో ఆ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆయనే అల్లరి నరేష్ ని ఉగ్ర రూపం లో చూపించే ప్రయత్నం చేసాడు. టీజర్ మరియు ట్రైలర్ దగ్గర నుండే ఈ చిత్రం మంచి ఇంటెన్స్ ఉన్న థ్రిల్లర్ జానర్ సినిమా అనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో అల్లరి నరేష్ ని చూసి ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు.ఇక ఈరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాము.

కథ :

CI శివ కుమార్ వరంగల్ సిటీ లో ఉండే ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.ఎలాంటి క్లిష్టమైన కేసు ని అయినా, ఆయన చాలా తేలికగా పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. అలా సాగిపోతున్న శివ కుమార్ జీవితం లోకి అపర్ణ (మిర్న మీనన్) వస్తుంది.ఆమెతో తొలిచూపు లోనే ప్రేమలో పడుతాడు శివ, అపర్ణ కూడా శివ ని ప్రేమిస్తుంది. తన తండ్రిని ఎదిరించి మరీ శివ ని పెళ్లి చేసుకుంటుంది. అలా 5 సంవత్సరాలు శివ తో కలిసి ఎంతో సంతోషంగా దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఒక బిడ్డకి జన్మని ఇస్తుంది. అయితే ఒకరోజు శివ తో కలిసి బయటకి వెళ్లి వస్తున్నా సమయం లో కుటుంబం మొత్తానికి యాక్సిడెంట్ అవుతుంది.ఈ యాక్సిడెంట్ లో శివ తన మెమరీ ని కోల్పోతాడు, అలాగే భార్య, బిడ్డ కనిపించకుండా పోతారు.కేవలం ఆయన భార్య బిడ్డ మాత్రమే కాదు, సిటీ లో ఎంతోమంది అలా కనిపించకుండా పోతారు. వాళ్ళందరిని వెతికి తిరిగి తీసుకొచ్చే క్రమం లో శివ కి ఎదురైనా సవాళ్లు ఏమిటి..చివరికి అందరినీ కాపాడుతాడా లేదా అనేదే స్టోరీ.

విశ్లేషణ :

సినిమా ప్రారంభం నుండే ఆసక్తికరంగా ఉండేలాగా డైరెక్టర్ విజయ్ కనకమేధాల చూసుకున్నాడు.కానీ ఇలాంటి సినిమాలకు హంగులు మరియు ఆర్భాటాలు యాడ్ చెయ్యకూడదు.ఫ్లో ఎలా ఉందొ అలాగే కొనసాగేలా స్క్రీన్ ప్లే ని రాసుకోవాలి.సినిమాటిక్ లిబర్టీ కోసం అవసరం లేకపోయినా కమర్షియల్ ఎలెమెంట్స్ ని యాడ్ చేస్తే సినిమా కంటెంట్ దెబ్బతింటుంది. డైరెక్టర్ విజయ్ చేసిన పొరపాటు ఇదే. గతం లో ఆయన అల్లరి నరేష్ తో తీసిన ‘నాంది’ చిత్రం లో ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫలితం కూడా అద్బుతంగా వచ్చింది. స్టోరీ లైన్ చాలా బాగుంది, కొన్ని కొన్ని సన్నివేశాలు థ్రిల్ కి గురి చేస్తాయి , కానీ సినిమాటిక్ లిబర్టీ ని పక్కన పెట్టి తీసి ఉంటే ఈ చిత్రం మరోలా ఉండేది.

ఒక ACP శివ కుమార్ గా అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన విశ్వరూపం చూపించేసాడనే చెప్పాలి. కానీ కొన్ని షాట్స్ లో ఆయన లుక్స్ సరిగా లేదు. ఫైట్స్ చాలా బాగా చేసాడు, అసలు అల్లరి నరేష్ లో ఇంత మాస్ ఉందా అని ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరికి అనిపించక తప్పదు. ఆ రేంజ్ లో చేసాడాయన,ఇక హీరోయిన్ గా నటించిన మిర్న మీనన్ కూడా పర్వాలేదు అనిపించింది.సినిమాటోగ్రఫీ బాగుంది, సన్ షైన్ సంస్థ కూడా క్వాలిటీ విషయం లో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తీశారు.మితిమీరిన ఫైట్ సన్నివేశాలు, అవసరం లేని సెంటిమెంట్ సీన్స్ ని తీసేసి ఉంటే ఈ చిత్రం సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచేది.

చివరి మాట :

మొత్తం మీద ‘ఉగ్రం’ ఒక యావరేజి కాప్ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు. అల్లరి నరేష్ కోసం ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 2.5/5