ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా పర్యటనపై రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఇటీవల పంచుకున్నారు. ఏమన్నాడంటే… ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా ఆటగాళ్ల కుటుంబాలను అక్కడికి అనుమతించకపోవడంపై హెడ్ కోచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఏఈలో ఐపీఎల్ పూర్తయ్యాక టీమిండియా ఆటగాళ్లు 48 గంటల పాటు క్వారంటైన్లో ఉన్నారు. అయితే హఠాత్తుగా అక్కడి అధికారులు టీమిండియా కుటుంబ సభ్యులను ఆసిస్ పర్యటనకు అనుమతించబోమని చెప్పారు.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన బీసీసీఐ.. తీవ్ర నిరాశ
ఈ నేపథ్యంలో రవిశాస్త్రీ రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కబెట్టారు. ఆటగాళ్లు తమ కుటుంబాలతో పాటు ఆసిస్ టూర్ కు వెళ్లేలా చేశారు. ఇందుకోసం బీసీసీఐ అధికారులతో చర్చించి ఒప్పించారు. ఈ విషయమై రాత్రింబవళ్లు తనకు ఆసిస్ టీం నుంచి ఫోన్లు వచ్చాయని శ్రీధర్ తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియా ఆటగాళ్ల కుటంబసభ్యులను అనుమతించమని వారు స్పష్టం చేశారని అన్నారు. దాంతో అసలు తాము ఆసిస్ టూర్ కు వెళ్తామా.. లేదా అనే అనుమానం వ్యక్తం అయ్యిందని.. ఈ క్రమంలో రవిశాస్త్రీ రంగంలోకి దిగి తాము ఎట్టి పరిస్థితుల్లో… కుటుంబసభ్యులతో వెళ్తామని చెప్పారని తెలిపారు.
Also Read: ఆస్ట్రేలియా దెబ్బ.. ఇంగ్లండ్ కూడా ‘అబ్బా’ అంటోంది?
40 ఏళ్లుగా తాను ఆసిస్ వెళ్తున్నానని అక్కడి పరిస్థితులు.. వారిని ఎలా ఒప్పించాలనేది తనకు బాగా తెలుసని అన్నాడని తెలిపారు. చివరికి బీసీసీఐ రంగంలోకి దిగి ఆస్ట్రేలియాను ఒప్పించడంతో టీమిండియా సభ్యులు వారి కుటుంబ సభ్యులతో టూర్ వెళ్లి చారిత్రాత్మక విజయం సాధించారని శ్రీధర్ తెలిపారు.